సీజనల్ పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇలాంటి వాటిలో జామకాయ ఒకటి. జామ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అంతేకాదు జామ ఆకు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును జామ ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. జామ ఆకులను నమలడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు.
ఖాళీ కడుపున జామ ఆకులను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల ఎన్నో రోగాల నుంచి బయటపడొచ్చు. మరి జామ ఆకులు మనకు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ బాగుంటుంది
ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం, అజీర్థి, ఎసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే జామ ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే నమిలి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు కూడా. ఇది మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. జామ ఆకుల్లో ఉండే ఎన్నో సమ్మేళనాలు మీ బరువును తగ్గిస్తాయి. ఇవి మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.
రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది
జామ ఆకుల్లో విటమిన్-సి కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో వ్యాధుల నుంచి బయపడతారు. రోగాలు కూడా త్వరగా నయమవుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
జామ ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.
guava
బీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది
జామ ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. జామపండు మాదిరిగానే దీని ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా ుంటాయి. ఈ పొటాషియం మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
చెడు కొలెస్ట్రాల్ ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే జామ ఆకులను ఉదయాన్నే నమిలితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ను నియంత్రించే గుణం ఈ ఆకులకు ఉంటుందని నిపుణులు అంటున్నారు.