సాధారణంగా శరీరంలోని ఏ ఒక్క భాగంలోనూ కొవ్వును విడిగా తగ్గించలేము. మొత్తం శరీర బరువు తగ్గినప్పుడే.. శరీరంలోని అనవసర కొవ్వు క్రమంగా తగ్గుతుంది. మంచి ఆహారపు అలవాట్లు వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువుతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పొట్ట చుట్టు కొవ్వు తగ్గడానికి...
ఒక వారం పాటు నిరంతరం వ్యాయామం చేస్తే, దానికి తగ్గ ఫలితాలను ఖచ్చితంగా శరీరంలో చూడవచ్చు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి నిద్ర వంటి జీవనశైలి మార్పులను దీర్ఘకాలం పాటించాలి. వాకింగ్, మెట్లు ఎక్కడం వంటివి కూడా పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
జంపింగ్ జాక్స్:
ఈ వ్యాయామాన్ని రెండు విధాలుగా చేయవచ్చు. మీరు నిరంతరం వ్యాయామం చేసేవారైతే.. దీని అడ్వాన్స్ వెర్షన్‌ను దూకి చేయవచ్చు. కొత్తవారైతే, నిలబడి చేయవచ్చు. ముందుగా ఎడమ కాలిని పక్కకు తీసుకెళ్లి మళ్లీ యధాస్థితికి తీసుకురావాలి. అదే సమయంలో రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ప్రతిసారీ కాలిని పక్కకు ఉంచినప్పుడు.. ఒక చేతిని పైకి ఎత్తాలి. దీన్ని వేగంగా చేయాలి. ఒక సెట్‌కు 30 చొప్పున 3 సెట్‌లు చేయవచ్చు.
హై నీస్:
పొట్ట కొవ్వును తగ్గించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి హై నీస్. దీన్ని కూడా దూకి చేయవచ్చు లేదా నిలబడి కాలిని పైకి ఎత్తవచ్చు. ఒక్కో కాలిని 15 సార్లు ఎత్తాలి. ఒక సెట్‌లో 30 సార్లు రెండు కాళ్లను ఎత్తవచ్చు. ఇవి మూడు సెట్‌లు చేయవచ్చు.
బర్పీస్:
పొట్ట కొవ్వు తగ్గించడానికి ఈ ఒక్క వ్యాయామం కూడా సరిపోతుంది. రోజుకు 100 బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలోని కేలరీలు వేగంగా కరుగుతాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ పరిశోధన ప్రకారం 10 బర్పీస్ చేయడం 30 సెకన్ల పాటు వేగంగా పరిగెత్తడంతో సమానం. ఈ వ్యాయామానికి ముందుగా ప్లాంక్ పొజిషన్‌లో నిలబడాలి. దీంతో పాటు స్క్వాట్, పుష్ అప్‌లు కూడా ఉంటాయి. పొట్ట కొవ్వును తగ్గించడానికి ఇది ఉత్తమ వ్యాయామం.
ఆహారపు అలవాట్లు:
- ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి. కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ప్రోటీన్ ఆహారాలు బరువు తగ్గడానికి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.
- పొట్ట కొవ్వు తగ్గాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, వేపుళ్లు మానేయాలి. నీళ్లు బాగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.