Skin care: ఈ ఒక్క ఫేస్ ప్యాక్ తో ముఖం మిలమిల మెరిసిపోతుంది!

Published : May 08, 2025, 03:58 PM IST
Skin care: ఈ ఒక్క ఫేస్ ప్యాక్ తో ముఖం మిలమిల మెరిసిపోతుంది!

సారాంశం

వేసవిలో ముఖం కాంతి తగ్గడం సహజం. అయితే దానిమ్మ ఫేస్ ప్యాక్ తో చర్మానికి కొత్త మెరుపు తీసుకురావచ్చు. ముడతలు, మచ్చలు తగ్గి ముఖం మిలమిల మెరిసిపోతుంది. మరి ముఖాన్ని అందంగా మార్చే ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా మంచిది. ఇది ముడతలు, గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్క, గింజల్లో ఎన్నో గుణాలున్నాయి. ఇవి చర్మం ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలో ఉండే విటమిన్ K, B, C లు చర్మాన్ని కాంతివంతంగా చేసి, ఎండ నుంచి రక్షిస్తాయి. ఇంట్లోనే దానిమ్మ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.

1. ఫేస్ ప్యాక్ తయారీ (How to Make Pomegranate Face Pack)

కావాల్సినవి:

4-6 దానిమ్మ గింజలు, 1 చెంచా పెరుగు, 1 చెంచా బేసన్ లేదా ముల్తానీ మట్టి (జిడ్డు చర్మానికి), 1/2 చెంచా తేనె (పొడి చర్మానికి)

తయారీ విధానం:

దానిమ్మ గింజలను మిక్సీలో లేదా రోట్లో బాగా నూరాలి. దాన్ని వడగట్టి రసం తీయాలి. లేదా గుజ్జులా వాడచ్చు. దానికి పెరుగు, బేసన్ లేదా ముల్తానీ మట్టి, తేనె కలపాలి. మెత్తని పేస్ట్ లా చేయాలి.

2. వాడకం (How to Apply the Pack)

ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్ తో కడిగి శుభ్రం చేయాలి. వేళ్లతో లేదా బ్రష్ తో ఫేస్ ప్యాక్ ని ముఖం, మెడ అంతా పట్టించాలి. కళ్ల చుట్టూ రాసుకోకూడదు. 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. గోరువెచ్చని నీటితో మెల్లగా మసాజ్ చేస్తూ కడగాలి. టవల్ తో తుడుచుకుని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారంలో రెండు సార్లు వాడాలి.

3. ప్రయోజనాలు (Benefits of Pomegranate Face Pack)

చర్మకాంతిని పెంచుతుంది

దానిమ్మలోని సహజ యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి.

మృత కణాలను తొలగిస్తుంది: 

బేసన్, పెరుగు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నల్ల మచ్చలను తగ్గిస్తాయి. దానిమ్మ రసం మచ్చలు, మొటిమల మీద పనిచేస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి: 

ముడతలు, మచ్చలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సహజ టోనర్లు చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. వేసవిలో మంట, ఎండ దెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం