నందమూరి నట సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య అంటే అటు ఫ్యాన్స్ లోనే కాదు.. ఇటు కో ఆర్టిస్ట్ లు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలయ్య బాబు గురించి నెగెటీవ్ గా చెప్పేవారు చాలా తక్కువ. సెట్ లో ఎంత చిన్న దర్శకుడు ఉన్నా.. అతను చెప్పినట్టు విని పనిచేస్తారు బాలకృష్ణ. ఇతర విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు బాలయ్య బాబు.