Brain: రోజూ ఇవి తాగితే, మెదడు పని చేయడం ఆగిపోతుంది..!

Published : May 07, 2025, 06:03 PM IST
Brain: రోజూ ఇవి తాగితే, మెదడు పని చేయడం ఆగిపోతుంది..!

సారాంశం

మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే,  కొన్ని రకాల డ్రింక్స్ కి మాత్రం కచ్చితంగా దూరంగా ఉండాలట. మరి, అవేంటో చూద్దామా..

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, గుర్తుంచుకునే శక్తి, నిర్ణయాలు మెదడు పని తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ, మనం తాగే కొన్ని పానీయాలు మనకు తెలీకుండానే నెమ్మదిగా మీ మెదడును  మెల్లగా బలహీనపరుస్తూ ఉండవచ్చు. ఈ పానీయాల వల్ల మెదడు తాత్కాలికంగా ఉత్తేజితమవుతున్నట్లు అనిపించినా, దీర్ఘకాలికంగా మాత్రం దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

1. ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్ శక్తిని ఇస్తాయని భావించి చాలా మంది రోజూ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. కానీ ఇవి కెఫీన్ , అధిక చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఎక్కువగా తీసుకుంటే మానసిక స్థిరత్వం దెబ్బతిని, ఆందోళన, మూర్ఛలు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు.

2. ఆల్కహాల్
తక్కువ మోతాదులో ఆల్కహాల్ మంచిదని అనుకోవడం ఒక అపోహ. ఏ మోతాదులోనైనా ఇది మెదడు కణాలను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ వల్ల మెదడులో కణాలను దెబ్బ తీస్తాయి. దీని వల్ల మెదడు పనితీరు కూడా దెబ్బతీస్తాయి.  దీర్ఘకాలంలో మతిస్థిమితం కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.

3. డైట్ సోడా
ఫిట్‌నెస్‌ను పరిరక్షించేందుకు డైట్ సోడాలను చాలా మంది ఎంచుకుంటారు. అయితే, వీటిలో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ మెదడు రసాయనాలను అవ్యవస్థితంగా మార్చుతాయి. స్ట్రోక్ రిస్క్ పెరిగే అవకాశమూ ఉంది.

4. ప్యాక్డ్ జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్
వీటిలో ఉన్న అధిక చక్కెర మెదడులో వాపును కలిగిస్తుంది. దీని వల్ల ఆలోచనా శక్తి మందగిస్తుంది. పిల్లలకు ఇవి తరచూ ఇచ్చే వారిని మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

5. అధిక కాఫీ వినియోగం
కాఫీలో ఉన్న కెఫీన్ అలసట తగ్గించినా, ఎక్కువగా తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం,  తెలీని టెన్షన్ ఉండటం, నిద్రలేమి, మానసిక అనిశ్చితి వంటి సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో మెదడుపై ఒత్తిడిని పెంచుతుంది.

సురక్షితమైన ప్రత్యామ్నాయాలు
ఈ హానికరమైన పానీయాల బదులు నిమ్మరసం, కొబ్బరినీరు, ఆయుర్వేద హెర్బల్ టీలు వంటి సహజమైన పానీయాలను ఎంచుకోవచ్చు. ఇవి శరీరానికి మాత్రమే కాకుండా, మెదడుకి కూడా ఉత్తమమైన ఉపశమనం కలిగిస్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?
Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!