తేనె ప్యాక్‌ను రాయండి
మోకాళ్ళు , మోచేతుల నలుపును తొలగించడానికి, తేనెలో నిమ్మరసం కలపండి, దానికి చక్కెర కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయండి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది, అలాగే చర్మం నలుపును కూడా తొలగిస్తుంది.
బంగాళాదుంప రసం చిట్కా
ఇంట్లో సులభంగా లభించే కూరగాయ అయిన బంగాళాదుంప బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. బంగాళాదుంప రసంలో నిమ్మ , టమాటా రసాలను కలపండి. దీనికి కలబంద, కొద్దిగా బియ్యం పిండిని కలపండి. ఈ పదార్థాలన్నింటినీ పేస్ట్ చేసి, మోకాళ్ళు, మోచేతులతో పాటు చేతుల వేళ్లపై కూడా రాయండి. 20 నిమిషాల తర్వాత, చేతులను తేలికపాటి నీటితో మసాజ్ చేసి, ఆపై స్పాంజితో శుభ్రం చేసుకోండి. మొదటిసారి ఉపయోగించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.