మంచిది కదా అని మరీ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 7, 2024, 1:46 PM IST

మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు.
 


నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు ఎలా పడితే అలా, ఏది పడితే అది, నాలుకకు రుచి దొరికితే చాలు అని తినేవారు కూడా... ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఫోకస్ పెడుతున్నారు. ఇదంతా కోవిడ్ తర్వాతే మొదలైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా.. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు.

నిజమే.. బరువు తగ్గాలంటే  ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ ఇన్ టేక్ ఎక్కువగా ఉంటే.. బరువు తగ్గవచ్చు. కానీ..  కొందరు  ఆహారంతో పాటు, స్పెషల్ గా మార్కెట్లో లభించే ప్రోటీన షేక్స్ కూడా తాగేస్తూ ఉంటారు. అదే పనిగా ప్రోటీన్ ని ఎక్కువ మొత్తంలొ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారిచూద్దాం...
 

Latest Videos


vegetables with protien

1.బరువు పెరగడం..

ప్రోటీన్ తీసుకుంటే బరువు తగ్గడమే కాదు.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. చాలా తక్కువ కాలం మాత్రమే ప్రోటీన్ తీసుకుంటే బరువు తగ్గుతారు. కానీ.. ఆ తర్వాతి నుంచి.. మన శరీరంలోకి ప్రోటీన్ పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది.  ప్రోటీన్ సాకుతో ఎక్కువ కేలరీలు తీసుకుంటే.. వెంటనే బరువు పెరిగిపోతారు.  

2. దుర్వాసన..

ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. నోటి దుర్వాసన కూడా పెరుగుతుంది.  ప్రోటీన్ లో ఉండే కెటోసిన్ అనే సమ్మేళనం కారణంగా ఇది జరుగుతుందట. మంచిగా బ్రష్ చేసినా కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి మీకు పరిష్కారం లభించాలంటే.. మీరు ఆరోగ్యకరమైన అలవాట్లకు మారాలి.

3.డీహైడ్రేషన్..

మీరు నమ్మకపోయినా ఇది నిజం. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేటెడ్ గా మారుతుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు మూత్రం ద్వారా అధిక ప్రోటీన్ ని బయటకు పంపించడానికి  రెండు రెట్లు అదనంగా కష్టపడతాయి. దీని వల్ల... తరచూ దాహం వేస్తూ ఉంటుంది.  శరీరం డీ హైడ్రేటెడ్ గా మారిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి.. దీనిని కంట్రోల్ చేయడానికి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుుకోవాలి. 


4.జీర్ణ సమస్యలు..
అధిక ప్రోటీన్ ఆహారాలు ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను సులభంగా తుడిచివేస్తాయి ఎందుకంటే వాటిలో ప్రీ-బయోటిక్స్ ఫైబర్ లేకపోవడం వల్ల ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆజ్యం పోస్తుంది. ఇది వివిధ ప్రేగు సమస్యలను కలిగిస్తుంది, అత్యంత ప్రబలంగా మలబద్ధకం , అతిసారం. కడుపులో తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

5. పోషకాహార లోపానికి కారణమవుతుంది...

ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల  పోషకాహార లోపం కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.  శరీరం అదనపు ప్రోటీన్లను స్వీకరిస్తే, అది కాలేయం, మూత్రపిండాలు , ఎముకలపై జీవక్రియ ఒత్తిడికి దారితీయవచ్చు. అదనంగా, ఇది ఈ అవయవాల నుండి పోషకాలను బయటకు తీయడానికి దారితీస్తుంది, ఇది మొత్తం జీవ పోషక సమతుల్యతను తగ్గిస్తుంది. అంతేకాదు.. రెడ్ మీట్ లాంటి ప్రోటీన్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
 

click me!