జార్ఖండ్ లో ఇండియా కూటమిదే అధికారం.. ఓటు షేరింగ్ లో బీజేపీ టాప్

First Published | Nov 23, 2024, 9:35 PM IST

Jharkhand Assembly Election Results 2024:  జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకున్నారు. ఇండియా కూటమి 50+ స్థానాల్లో విజయం సాధించింది. అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల  ఓట్ల శాతంలో బీజేపీ టాప్ లో నిలిచింది. 
 

Jharkhand Assembly Election Results 2024:  జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి వస్తోంది. హేమంత్ సోరెన్ మ‌రోసారి త‌న అధికార పీఠాన్ని నిలబెట్టుకోగలిగారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో క‌న‌బ‌డిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెనుకబడి పోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హేమంత్ సోరేన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

50+ స్థానాలు గెలుచుకున్న ఇండియా కూట‌మి 

జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయం సాధించింది. మొత్తం 81 సీట్లలో ఇండియా కూటమి 50+ నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది. మొత్తంగా పార్టీల వారీగా గెలుచుకున్న స్థానాలు గమనిస్తే.. జేజేఎం 34 స్థానాలు, బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ ఎంఎల్ఎల్ 2 స్థానాలు గెలుచుకున్నాయి.  


మ‌రోసారి జేజేఎం దే అధికారం

జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం మరోసారి అధికారంలోకి రానుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తన స్థానం బర్హెత్ నుంచి ఘనవిజయం సాధించారు. బర్హత్ రాష్ట్రంలోనే హాటెస్ట్ సీటుగా నిలిచింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇది 1980 నుండి నిరంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) ఆధీనంలో ఉంది. గత 44 ఏళ్లలో ఈ స్థానంలో జేఎంఎం ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు.

Jharkhand Assembly Election Results 2024, Hemant Soren, JMM

బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ గెలుపు

జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై  ఆయ‌న విజయం సాధించారు. మొత్తం 95,612 ఓట్లతో ఆయన గెలుపొందినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. సోరెన్ కు 39791 ఓట్ల మెజారిటీ వ‌చ్చింది. 

పార్టీ ఓటు షేర్ లో బీజేపీ టాప్ 

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 ఫ‌లితాల్లో బీజేపీ 21 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పటికీ ఓట్ల శాతంలో టాప్ లో నిలిచింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 33.18 శాతం ఓట్లను సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జేజేఎం 23.44 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 15.56 శాతం ఓట్లను సాధించింది. ఆర్జేడీ 3.44 శాతం ఓట్లు సాధించింది. ఏజేఏస్క్ష్ యూపీ 3.54 శాతం ఓట్లు సాధించింది. ఇతరులు 14.11 శాతం ఓట్లు సాధించారు. నోటాకు 1.27 శాతం ఓట్లు పడ్డాయి. 

Latest Videos

click me!