`బాహుబలి` డిజాస్టరా? నిర్మాతలకు భారీ నష్టం, కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపెట్టిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌

First Published | Nov 23, 2024, 9:15 PM IST

`బాహుబలి` సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌, ఇండస్ట్రీ హిట్‌ అని అంతా చెబుతుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిందట.  
 

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన `బాహుబలి` పార్ట్ 1 2017లో విడుదలైంది. ఆర్కా మీడియా పతాకంపై శోభూ యార్టగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు.

సుమారు రూ. 150-200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన తొలి తెలుగు సినిమా ఇదే. అంతేకాదు అంతే స్థాయిలో ఆదరణ పొందింది. భారీగా కలెక్షన్లని సాధించింది. ఐదు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 650కోట్ల వరకు వసూలు చేసిందని టీమ్‌ చెబుతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

బయటకు ఈ మూవీ ఆహా, ఓహో అనేలా ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా నిర్మాతలకు మాత్రం నష్టాలను మిగిల్చిందట. ఈ మూవీ వల్ల నిర్మాతలు భారీగానే నష్టపోయారట. బయటకు జరుగుతున్న ప్రచారం నిజం కాదని, బాహుబలి మొదటి పార్ట్ వల్ల నిర్మాతలు నష్టపోయారని సీనియర్‌ నిర్మాత ఆదిశేషగిరి రావు వెల్లడించారు. ఆయన సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు అనే విషయం తెలిసిందే. కృష్ణతో పద్మాలయ పిక్చర్స్ ద్వారా అనేక సినిమాలు నిర్మించారు. పద్మాలయ స్టూడియోని నిర్వహించారు. 
 


ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, `బాహుబలి` సినిమా పెద్ద హిట్‌ అని బయట మాట్లాడుకుంటున్నారు. మీడియా అదే రాస్తుంది. కానీ నిజం ఏంటంటే ఆ మూవీ వల్ల నిర్మాతలు నష్టపోయారు. బయటకు ప్రకటించిన కలెక్షన్లు నిజం కాదు. అదంతా పెద్ద మాయ. కలెక్షన్లు ప్రొడక్షన్‌ టీమ్‌ నుంచి లీక్‌ చేస్తారు.

అదే మీడియా రాస్తుంది. చాలా వరకు అందులో నిజం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం జరగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అదే జరుగుతుందని వెల్లడించారు. నిర్మాతలు ప్రకటించినవే బయటకు వస్తుంటాయని, కానీ వాస్తవ కలెక్షన్లు వేరుగా ఉంటాయని, చాలా తక్కువగా ఉంటాయని ఆయన వెల్లడించారు. 
 

సినిమా బిజినెస్‌, హీరో మార్కెట్‌, నెక్స్ సినిమా బిజినెస్‌ ఇలాంటివి అన్నీ దృష్టిలో పెట్టుకుని బయటకు లాస్‌గా ఎవరూ ప్రకటించరని, ఎక్కువ కలెక్షన్లు ప్రకటిస్తారని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓరకంగా ఇండస్ట్రీలో కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారాన్ని ఆయన బయటపెట్టారు. ఐదారేళ్ల క్రితం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు ఆదిశేషగిరి రావు. ఇప్పటికీ అదే జరుగుతుందనేది నిజం. అయితే మొదటి పార్ట్ విషయంలో అందరు టెన్షన్‌ పడ్డారు.

రాజమౌళి సైతం చాలా టెన్షన్‌కి గురయ్యారట. తాను ఎక్కువగా టెన్షన్ పడ్డ మూవీ ఇదే అని ఆయన వెల్లడించారు. అలాగే ప్రభాస్‌ కూడా ఈ మూవీ హిట్‌ అని నిర్థారణకు రావడానికి చాలా టైమ్‌ పట్టిందని, మార్నింగ్‌ కి వచ్చిన రిపోర్ట్ ప్రకారం సినిమా పోయిందనే అనుకున్నారట. ముందు రోజు నుంచి ఆయన టెన్షన్‌ పడుతూనే ఉన్నారట. సాయంత్రానికి, నెక్ట్స్ డేకి గాని ఆయన సినిమా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చారట. 
 

ఇదిలా ఉంటే `బాహుబలి` పార్ట్ వన్‌ నష్టపోయినా, `బాహుబలి 2`తో నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఈ మూవీ అధికారిక లెక్కల ప్రకారం 1800కోట్లు వసూలు చేసింది. ఆదిశేషగిరిరావు చెప్పినదాని ప్రకారం 20-30 శాతం ఎక్కువగా ప్రకటించినా ఆ మూవీ 1500కోట్ల వరకు వసూలు చేసి ఉంటుంది. అంటే సుమారు 800కోట్ల షేర్‌ వసూలు చేసి ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్‌ మూడు వందల కోట్ల వరకు ఉంటుంది. ఈ రకంగా నిర్మాతలకు లాభాలే వచ్చి ఉంటాయని చెప్పొచ్చు. 

read more:జగపతిబాబు చేసిన పనికి లక్షల్లో మోసపోయిన హీరో, ఇప్పటికీ ఇద్దరికి మాటల్లేవ్‌

also read: పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఆగిపోయిందా? మరో సినిమా కూడా డౌటే? ఫ్యాన్స్ లో ఆందోళన!

Latest Videos

click me!