మెకానిక్‌ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవ ఫస్ట్ డే కలెక్షన్లు.. పాపం మహేష్‌ అల్లుడి సినిమా పరిస్థితి దారుణం

First Published | Nov 23, 2024, 10:44 PM IST

ఈ శుక్రవారం విడుదలైన `మెకానిక్‌ రాకీ`, `జీబ్రా`, `దేవకీ నందన వాసుదేవ` సినిమాలు ఫలితాలు, కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 
 

ఈ వారం తెలుగులో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో ప్రముఖంగా మూడు సినిమాలున్నాయి. విశ్వక్‌ సేన్‌ నటించిన `మెకానిక్‌ రాకీ`, సత్యదేవ్‌, ధనంజయ్‌ కలిసి నటించిన `జీబ్రా`, మహేష్‌ బాబు అల్లుడు నటించిన `దేవకీ నందన వాసుదేవ` చిత్రాలు విడుదలయ్యాయి. మరి వీటి ఫలితాలు, కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ కలిసి నటించిన `మెకానిక్‌ రాకీ` బిలో యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇన్సురెన్స్ పేరుతో మోసాలు అనే పాయింట్‌ తప్పితే మిగిలినదంతా రొటీన్‌ అనే అభిప్రాయం ఆడియెన్స్ నుంచి వినిపించింది. ఈ మూవీకి కలెక్షన్లు కూడా డల్‌గానే ఉన్నాయి. గతంలో విశ్వక్‌ సేన్‌ సినిమాలు నాలుగైదు కోట్ల గ్రాస్‌ వచ్చాయి. ఎనిమిది కోట్ల గ్రాస్‌ సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ `మెకానిక్‌ రాకీ` మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ మూవీ గత చిత్రాలతో పోల్చితే సగానికి సగం పడిపోయింది. 

Latest Videos


ఈ మూవీ తొలి రోజు 2.20 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1.25 షేర్‌ సాధించింది. తెలుగు స్టేట్స్ లో 1.65కోట్ల గ్రాస్‌, కోటీ షేర్‌ రాబట్టింది. ఈ మూవీకి 10కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ అయ్యింది. అంటే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు 20కోట్ల గ్రాస్‌ వసూలు చేయాలి. ఇప్పుడున్న టాక్‌ని బట్టి చూస్తే ఈ మూవీ పది కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం కూడా కష్టమే అని తెలుస్తుంది. అంటే ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్‌ వర్గాల అంచనా. మరి దాన్ని దాటుకుని పుంజుకుంటుందా? అనేది చూడాలి. 

సత్యదేవ్‌, డాలి ధనంజయ్‌ కలిసి `జీబ్రా` సినిమాలో నటించారు. ఈ మూవీ బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమా గందరగోళంగా ఉందనే అభిప్రాయం ఉంది. సాధారణ ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం కష్టమని అంటున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే కొంతలో కొంత ఫర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకి నాలుగు కోట్ల బిజినెస్‌ అయ్యింది. మొదటి రోజు ఇది కోటీ పది లక్షల గ్రాస్‌ వసూలు చేసింది. 85లక్షల షేర్‌ వచ్చింది. అయితే సినిమా పుంజుకుంటే సేఫ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. కానీ దీనిపై ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఈ లెక్కన బ్రేక్‌ఈవెన్‌ కూడా కష్టమే అని చెప్పొచ్చు. 
 

ఇక శుక్రవారం వచ్చిన ప్రముఖమైన సినిమాల్లో `దేవకి నందన వాసుదేవ` కూడా ఉంది. ఇందులో మహేష్‌ బాబు మేనల్లుడు, మాజీ ఎంపి గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్‌ హీరోగా నటించడం విశేషం. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ డే దారుణమైన ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది. 2.25కోట్ల బ్రేక్‌ ఈవెన్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే కేవలం పది లక్షల షేర్‌ని కూడా రాబట్టుకోలేకపోయింది. ఇది దారుణమైన ఫలితంగా చెప్పొచ్చు.

చిన్న హీరోల సినిమాల కంటే తక్కువగా ఉండటం షాకిస్తుంది. చాలా చోట్ల షోస్‌ ఎత్తేశారట. ఇది మహేష్‌ బాబు ఫ్యామిలీకే పెద్ద అవమానంగా చెప్పొచ్చు. గల్లా అశోక్‌ బిజినెస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆయన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలవడం షాకిస్తుంది. మరి హీరోగా నిలబడాలంటే ఆయన నటన పరంగానూ మెరుగుపడాలి. మంచి కథలు కూడా ఎంచుకోవాలి. ఈ శుక్రవారం విడుదలైన అన్ని సినిమాలు నిరాశ పరిచినట్టు ఆడియెన్స్ నుంచి వినిపించే మాట. 

read more:`బాహుబలి` డిజాస్టరా? నిర్మాతలకు భారీ నష్టం, కలెక్షన్ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపెట్టిన సీనియర్‌ ప్రొడ్యూసర్‌

also read: జగపతిబాబు చేసిన పనికి లక్షల్లో మోసపోయిన హీరో, ఇప్పటికీ ఇద్దరికి మాటల్లేవ్‌

click me!