పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. మ్యారేజ్ డేస్ ని గుర్తు చేసేలా

First Published Sep 16, 2021, 3:27 PM IST

ఎన్ని రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ సమంత, చైతు మాత్రం స్పందించడం లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సమంత ఇటీవల శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని వెకేషన్స్, ఫోటో షూట్స్ తో బిజీగా ఉంది. 

ఎన్ని రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ సమంత, చైతు మాత్రం స్పందించడం లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. సమంత ఇటీవల శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని వెకేషన్స్, ఫోటో షూట్స్ తో బిజీగా ఉంది. ఇక నాగ చైతన్య త్వరలో రిలీజ్ కాబోతున్న లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. 

సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం సామ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక ప్రమోషనల్ ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. 

Latest Videos


తాజాగా సమంత బ్రైడల్ లుక్ లో మతిపోగోట్టే ఫోటో షూట్ చేసింది. అందమైన నవ వధువుగా సమంత ముస్తాబై ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  రెడ్ బనారసీ శారీలో ఒంటినిండా ఆభరణాలు ధరించి సమంత ఇచ్చిన ఫోజు కేకపెట్టించే విధంగా ఉంది. 

నవ్వు, చీరకట్టులో ఆమె స్టైల్ మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం సామ్ ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోస్ ని సామ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. సామ్ బ్రైడల్ లుక్ తన పెళ్లి రోజులను గుర్తు చేసే విధంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

ఇక గత కొంతకాలంగా సమంత, నాగ చైతన్య మనస్పర్థలతో విడి విడిగా ఉంటున్నారని. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా ఇలాంటి ప్రశ్నలు, ప్రస్తావన ఉండకూడదని నాగ చైతన్య తన పీఆర్ టీంని హెచ్చరించాడట. 

అయితే ఇటు నాగార్జున.. అటు సామ్ కుటుంబ సభ్యులు ఈ జంట మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సామ్ లవ్ స్టోరీ ట్రైలర్ పై స్పందించినప్పటికీ.. చైతు పేరు మెన్షన్ చేయలేదు. 

click me!