సీజన్ 1లో పాల్గొన్న హరి తేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ రావడం పక్కా అంటున్నారు.

04:46 PM (IST) Sep 21
కంటెస్టెంట్ అభయ్ నవీన్ కి హోస్ట్ ఊహించని షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ రూల్స్ ని తప్పుబడుతూ, అనుచిత కామెంట్స్ చేసిన అభయ్ నవీన్ కి రెడ్ కార్డు ఇచ్చాడు. నేరుగా బయటకు పంపేశాడు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదే ప్రథమం.
ఈవారం డబుల్ ఎలిమినేషన్, ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు, ఎవరూ ఉహించని ట్విస్ట్!
02:25 PM (IST) Sep 21
బిగ్ బాస్ షో వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై స్టార్ మా ఛానల్ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. కాపీ రైట్ స్ట్రైక్స్ వేస్తున్నారట. దీనిపై కొందరు నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వీడియోలను ఎడిట్ చేసి కంటెస్టెంట్స్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దానికి అడ్డు కట్ట వేసినట్లు అవుతుందని అంటున్నారు. అదే సమయంలో అసలు నీ బిగ్ బాస్ షోని ప్రమోట్ చేస్తుంది మేమే. కాపీ రైట్ స్ట్రైక్స్ వేయడం వలన స్టార్ మా కే నష్టం అంటున్నారు ఇంకొందరు.
01:36 PM (IST) Sep 21
మూడో వారం బిగ్ బాస్ తెలుగు 8 షో నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత వారం బాటమ్‌లో ఉన్న ఇద్దరు ఈ సారి కూడా కిందనే ఉన్నారు. కానీ అనూహ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన వ్యక్తి కూడా తక్కువ ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. కింద అభయ్ ఉండగా, ఆ తర్వాత కిర్రాక్ సీత, పృథ్వీ రాజ్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అనేది సస్పెన్స్ గా మారింది.
01:04 PM (IST) Sep 21
పదే పదే హౌస్లో భార్య పిల్లలను తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు నాగ మణికంఠ. తన కుటుంబం తనకు దక్కాలంటే ఈ షో నేను గెలవాలని కన్నీరు పెట్టుకుంటున్నాడు. అయితే నాగ మణికంఠ సింపతీ గేమ్ కి ఆయన వైఫ్ బ్రేక్ వేసింది. భర్త నాగ మణికంఠపై పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియ చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాకరేపుతున్నాయి.
నాగ మణికంఠ బండారం ఇది, ఝలక్ ఇచ్చిన వైఫ్, కాకరేపుతున్న సోషల్ మీడియా పోస్ట్స్!
06:34 AM (IST) Sep 21
ఐదవ వారం మరో 5 మంది సెలెబ్స్ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే లాంచింగ్ ఎపిసోడ్ లో కేవలం 14 మందిని పరిచయం చేశారు. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా సీజన్ 1లో పాల్గొన్న హరి తేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ రావడం పక్కా అంటున్నారు.
వైల్డ్ కార్డు ఎంట్రీలు: లాభం లేదు! వారిద్దరూ రావాల్సిందే, ఒకరు ఫైర్ బ్రాండ్, మరొకరు ఎంటర్టైనర్!