vuukle one pixel image

ఇది లవ్ జిహాద్ కేసు. జానీ మాస్టర్‌పై బీజేపీ నాయకురాలు ఫైర్‌

konka varaprasad  | Published: Sep 18, 2024, 8:00 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగరాఫర్‌పై స్టార్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారాన్ని తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అన్నారు. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇది లవ్ జిహాద్ కేసు అని... హిందూ యువతిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.