సోనియా పన్నాగం, అభయ్ ను గెట్ అవుట్ అన్న బిగ్ బాస్, రికార్డ్ క్రియేట్ చేసిన నిఖిల్..

First Published | Sep 21, 2024, 12:11 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. తొందరపాటు నిర్ణయాలతో మంచివారు అనుకున్నవారు కూడా విలన్లు గా నిలుస్తున్నారు. 
 

బిగ్ బాస్ తెలుగు 8 లో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏక్షణం ఎవరు ఎలా మారుతున్నాతో అర్ధం కావడంలేదు. మొదటి నుంచీ హౌస్ లో విలన్ పాత్రను పోషిస్తుంది సోనియా. మరోసారి తన కన్నింగ్ బుద్దిని ప్రదర్శించింది. 

ఎంతో స్ట్రాంగ్ గా ఉంటూ.. హౌస్ ను నడిపిస్తూ వస్తున్న నిఖిల్ ను ఎమోషనల్ గా వీక్ చేస్తోంది సోనియా. తాను అనుకున్నది సాధించడం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. అనుకున్నది సాధిస్తూ వస్తోంది. అది ఆమె గేమ్ స్ట్రాటజీనా.. లేక ఓరిజినల్ గా సోనియా అలానే ఉంటుందా తెలియదు కాని.. సోనియా చేస్తున్న పనులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg Boss Telugu 8

ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న శక్తీ టీమ్ లో సోనియా మంటలు పెట్టడానికి నిఖిల్ ను గట్టిగా వాడుకున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ తో మొదటి నుంచీ క్లాజ్ గా ఉంటూ వస్తున్న సోనియా.. అతన్ని దూరం పెడుతూ.. ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నం చేసింది. దాంతో అందరూ కావాలి అనుకునే నిఖిల్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. 

ఇక కోడిగుడ్ల గేమ్ లో రెడ్ ఎగ్ ను నిఖిల్ సాధించడా.. అయితే ఆ ఎగ్ ను ఎవరికైనా ఇచ్చి.. శక్తీ టీమ్ కు న్యూ చీఫ్ గా ఎన్నుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో నిఖిల్ ఆలోచించకుండా ఆ అవకాశాన్ని సోనియాకు ఇచ్చాడు. దాంతో టీమ్ అంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. 


నిఖిల్‌, పృధ్వి, సోనియా ఒక గ్రూప్ గా ఉంటున్నారు. ఇక నిఖిల్ చేసిన పనికి అప్పటి వరకూ అతిపై బ్యాడ్ గా చెప్పుకుంటూ వచ్చిన ఆమె.. నిఖిల్ పై ఎక్కడా లేని ప్రేమను బయటక తీసి హగ్గులు చేసుకుంటూ హడావిడి చేసింది. ఇక తనకు రెడ్ ఎగ్ వస్తుందనుకుని ఆశపడ్డ సీత.. నిఖిల్ పై కోపం పెంచుకున్నట్టు కనిపిస్తోంది. 
 

Bigg Boss Telugu 8

రెడ్ ఎగ్ పొందినా కూడా టాస్క్ లో గెలిచి మరోసారి ఛీప్ అయ్యాడు నిఖిల్. బిగ్ బాస్ హౌస్ కు పర్మినెంట్ చీఫ్ గా నిఖిల్ ఉండేట్టు కనిపిస్తున్నాడు.  మూడో వారంలో మూడోసారి చిఫ్ గా గెలిచి బిగ్ బాస్ హిస్టరీని తిరగరాశాడు నిఖిల్. ఇక అటు తనకు అవకాశం ఇవ్వనందుకు రగిలిపోతోంది సీత. 

Bigg Boss Telugu 8

ఇక బిగ్ బాస్ పై రకరకాల కామెంట్లు చేస్తూ... రెచ్చిపోతన్నాడు అభయ్. దాంతో చిర్రెత్తుకొచ్చిన బిగ్ బాస్.. ఎవరికి ఇష్టంలేకపోయినా. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ గేట్లు ఓపెన్ చేశాడు. దాంతో అందరూ బిగ్ బాస్ కు సారి చెప్పారు. అయినా సరే తన నోటి దురు ఆపుకోలేకపోయాడు అభయ్ తను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. 

Latest Videos

click me!