మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. ఏఎన్నార్ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డ్ ఆయనకు అందబోతోంది. అయితే ఇక్కడే మరో విశేషం కూడా ఉంది.
మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డ్ ను స్యయంగా అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇక అక్టోబర్ 28న అవార్డు ను చిరుకు ప్రధానం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి అవార్డును అందజేయనున్నారు.
ఇక ఈ విషయాన్ని తాజాగా హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. అయితే చిరంజీవికి ప్రత్యేక అవార్డ్ దక్కనుంది. అక్కినేని శత జయంతి అవార్డ్ ను మెగాస్టార్ కు అందించబోతున్నారు. ఈ అవార్డ్ ను జాతీయ స్థాయిలో అందిస్తుండటం విశేషం. ఈ శుక్రవారం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు.
undefined
ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారన్నారు. ఈ వీకెండ్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని అన్నారు.
అంతే కాదు అక్కినేని శతజయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదన్నారు. రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Remembering the legendary ANR, garu, one of the greatest actors of all time on his 100th birth anniversary.
An acting genius and A doyen of Cinema, ANR garu’s memorable performances remain etched in the hearts and minds of Telugu audiences. His… pic.twitter.com/nW0TCrz2Cf
ఇక అక్కినేని శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆయనను స్మరించుకున్నారు. చిరంజీవి ఈవిధంగా అన్నారు. ఆల్ టైమ్ గ్రేట్ నటుల్లో ఒకరైన నాగేశ్వరరావుని ఆయన శత జయంతి రోజున స్మరించుకుందాం. నాగేశ్వరరావు నటనా మేధావి.. అద్భుతమైన నటనా ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయరన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని చిరంజీవి అన్నారు. మెకానిక్ అల్లుడు సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కిందన్నారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని మెగాస్టార్.. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను చిరంజీవి ఎక్స్ వేధికగా పంచుకున్నారు