అల్లు అర్జున్ సీన్ లోకి రాకపోతే ‘బొమ్మ‌రిల్లు’ సినిమా ఆగిపోను

First Published | Sep 21, 2024, 6:24 AM IST

 ఈ సినిమా మొద‌టిరోజు షూటింగ్‌లో ఐస్‌క్రీమ్ సీన్ షూట్ చేశాం. జెనీలియా అర్ధరాత్రి పూట రోడ్డు పై ఐస్ క్రీం తింటూ ఉంటుంది.

టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఈరెండు భాషలే కాకుండా.. బాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ ను సంపాధించాడు అల్లు అర్జున్. అంతే కాదు. పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే అదే సమయంలో తోటి స్టార్స్ కు, డైరక్టర్స్ కు ఎంకరేజ్మెంట్ ఇవ్వటంలో ముందు ఉంటాడు. 

allu arjun

సిద్దార్థ్, జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ క్లాసిక్ చిత్రం ‘బొమ్మ‌రిల్లు’ (Bommarillu). సిద్దార్థ్, జెనీలియా ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌తో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్‌లో మర్చిపోలేని చిత్రాల‌లో ఇది ఒక‌టిగా నిలిచింది. 2006లో విడుద‌లైన ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది.

భాస్కర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ కు బాగా పట్టేసింది.  దాంతో పెద్దగా హంగామా లేకుండా రిలీజైన ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్లో 100 రోజులు ఆడిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌ ‘బొమ్మరిల్లు భాస్కర్‌’గా మారాడు. ఈ సినిమా రీరిలీజ్ వేళ డైరక్టర్ భాస్కర్ ఓ ఆసక్తకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు.


Allu Arjun


భాస్కర్ మాట్లాడుతూ....ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా భాస్క‌ర్ మీదా కోపంతో జెనీలియా వెళ్లిపోయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మొద‌టిరోజు షూటింగ్‌లో ఐస్‌క్రీమ్ సీన్ షూట్ చేశాం. జెనీలియా అర్ధరాత్రి పూట రోడ్డు పై ఐస్ క్రీం తింటూ ఉంటుంది.

అలా తినడానికి వెళ్లే ముందు హీరోకి ఫోన్ చేస్తే అతను వద్దని చెబుతాడు. అయినప్పటికీ అతని మాటని లెక్కచేయకుండా వెళ్తున్నాను అని చెప్పడంతో హీరో గోడదూకి మరీ ఆమె వద్దకు వెళ్తాడు.


 అలా అతను వెళ్లినప్పుడు.. ‘తింటావా అని’ అంటుంది జెనీలియా. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు దర్శకుడు ఆశించిన విధంగా ఆమె డైలాగ్ చెప్పడం లేదట. నైట్ 9,10 గంటలకు ఆ సీన్ షూటింగ్ మొదలుపెట్టారట.

తెల్లవారుజాము వరకు ఆ సీన్ చేస్తూనే ఉన్నారట.  క‌నీసం 35 టేక్‌లు తీసుకున్నాను. దీంతో జెనీలియా కోపంతో నా ద‌గ్గ‌రికి వ‌చ్చి ఏంటి రెండు ముక్క‌ల డైలాగ్ చెప్ప‌లేనా నేను అంటూ నేను ఈ సినిమా చేయ‌ను అంటూ వెళ్లిపోయింది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 


అయితే ఆ రోజు షూటింగ్‌కు అల్లు అర్జున్ వ‌చ్చాడు. తానే జెనీలియా ద‌గ్గ‌రికి వెళ్లి అలా చేయ‌కు. ఇది మంచి సినిమా, మంచి ద‌ర్శ‌కుడు మొద‌టిరోజే జ‌డ్జ్ చేయ‌కు.. ఈ సినిమా చేయి అంటూ త‌న‌ను ఒప్పించాడు అంటూ భాస్కర్ చెప్పుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో హాసిని అనే పాత్రలో కనిపించింది జెనీలియా. 


డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు భాస్కర్. అప్పుడే భాస్కర్ లోని టాలెంట్  చాలామంది గుర్తించారు . వారిలో  అల్లు అర్జున్ ఒకరు. ఆ టైమ్ లోనే  ఈ కథ అల్లు అర్జున్ కి తెలియటం.

అలానే బొమ్మరిల్లు భాస్కర్  టాలెంట్ కూడా బన్నీ తెలియడం వలన ఇది ఒక మంచి కథ అని చెప్పి జెనీలియా ను ఈ సినిమా కోసం ఒప్పించారు. మొత్తానికి అల్లు అర్జున్ జెనీలియా చెప్పినట్లు తన కెరియర్లో ఈ సినిమా ఒక బెస్ట్ ఫిలిం గా నిలించిందనే చెప్పాలి.

Latest Videos

click me!