2024కి గాను ఎమ్మి అవార్డ్స్ ప్రకటించారు. ది బేర్ అత్యధిక అవార్డులు కొల్లకొట్టింది. పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
ఎమ్మి అవార్డులు ప్రకటించగా ది బేర్ సత్తా చాటింది. ది బేర్ సీజన్ 2 రికార్డు స్థాయిలో 23 నామినేషన్లతో సత్తా చేతినుండి. చరిత్రలో అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్లో పలువురు స్టార్లు నటించారు. అన్నా సవాయి, హిరోయుకి సనాడా, తడనోబు అసనో, తకేహిరో హీరా , నెస్టర్ కార్బోనెల్‌లు వంటి నటులు భాగమయ్యారు. గత వారాంతంలో జరిగిన క్రియేటివ్ ఆర్ట్స్ ఎమ్మీస్‌లో 14 అవార్డులను గెలుచుకోవడం ద్వారా షోగన్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్ కి అత్యధిక అవార్డులు అందుకున్న సిరీస్ షోగన్.
ది క్రౌన్ లాస్ట్ సీజన్ 18 నామినేషన్లను అందుకుంది, అయితే డొనాల్డ్ గ్లోవర్, మాయా ఎర్స్‌కిన్ నటించిన ఫాల్అవుట్, మిస్టర్ & మిసెస్ స్మిత్ వంటి కొత్త సిరీస్‌లు ఒక్కొక్కటి 16 నామినేషన్లను పొందాయి.
2024 ఎమ్మీ విజేతల పూర్తి జాబితా
డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: మార్నింగ్ షో ఫర్ బిల్లీ క్రుడప్
కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: ది బేర్ ఫర్ ఎబోన్ మోస్-బచ్రాచ్
కామెడీ సిరీస్‌లో ఉత్తమ ప్రధాన నటుడు: ది బేర్ ఫర్ జెరెమీ అలెన్ వైట్
కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: ది బేర్ ఫర్ లిజా కోలోన్-జయాస్
డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: ది క్రౌన్ ఫర్ ఎలిజబెత్ డెబికి
కామెడీ సిరీస్‌లో ఉత్తమ ప్రధాన నటి: హ్యాక్స్ ఫర్ జీన్ స్మార్ట్
అత్యుత్తమ రియాలిటీ పోటీ కార్యక్రమం: ది ట్రైటర్స్
ఆంథాలజీ సిరీస్ / మూవీలో ఉత్తమ సహాయ నటి: బేబీ రెయిన్ డీర్ ఫర్ జెస్సికా గన్నింగ్
ఉత్తమ స్క్రిప్ట్ వెరైటీ సిరీస్: జాన్ ఆలివర్‌తో లాస్ట్ వీక్ టునైట్
వెరైటీ స్పెషల్ కోసం ఉత్తమ రచన: అలెక్స్ ఎడెల్మాన్ కోసం అలెక్స్ ఎడెల్మాన్: జస్ట్ ఫర్ అజ్
ఆంథాలజీ సిరీస్/ సినిమాకి ఉత్తమ దర్శకత్వం: రిప్లే కోసం స్టీవెన్ జైలియన్
కామెడీ సిరీస్ కి ఉత్తమ రచన: లూసియా అనియెల్లో, పాల్ W డౌన్స్, హ్యాక్స్ కోసం జెన్ స్టాట్స్కీ
ఉత్తమ టాక్ సిరీస్: ది డైలీ షో
ఉత్తమ టాక్ సిరీస్: ది డైలీ షో