కరీనా కపూర్ ఇంటిమేట్ సీన్స్ కు దూరం ఎందుకు? ఆమె ఏం చెప్పిందో తెలుసుకోండి. ఈ సందర్భంగా ఆమె ఒక భారీ స్టేట్‌మెంట్ ని ఇచ్చింది. బలమైన కారణాన్నే ఆమె వెల్లడించింది.
కరీనా కపూర్, గిలియన్ అండర్సన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ బెడ్ సీన్లకి సంబంధించి, రొమాంటిక్ సీన్లకి సంబంధించి ఆమె ఓపెన్ అయ్యింది.
బెడ్ సీన్లకి సంబంధించి గిలియన్ అడిగిన ప్రశ్నకు కరీనా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె విచిత్రమైన సమాధానాన్ని వెల్లడించింది. అదే సమయంలో చాలా లాజికల్ ఫ్యాక్టర్‌ని కూడా వివరించడం విశేషం.
బెడ్ సీన్లు కథకు అవసరం లేదని, అవి జనాన్ని ఆకర్షించేందుకు చేసే జిమ్మిక్కులేనని ఆమె వెల్లడించింది. నిజానికి కథలో వాటికి అంత ప్రయారిటీ ఉండదని ఆమె వెల్లడించింది.
అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకు కంఫర్ట్ గా అనిపించదని, చాలా ఇబ్బందిగా ఉంటుందని, అందుకే వాటికి దూరంగా ఉంటానని చెప్పింది కరీనా కపూర్.
ఈ సందర్భంగా ఆ రొమాన్స్ ని గౌరవించాలని కరీనా అభిప్రాయపడింది. తాను సినిమాల్లో దానికి వ్యతిరేకం అని, కానీ బయట మాత్రం ఆ విషయాన్ని గౌరవిస్తానని తెలిపింది కరీనా కపూర్.