AR Rehman: ఛాతి నొప్పితో హాస్పిటల్‌లో చేరిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రెహ్మాన్‌.. ఇప్పుడెలా ఉందంటే?

AR Rehman: ఆస్కార్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెహ్మాన్‌ చేరినట్టు తెలుస్తుంది.


AR Rehman: భారతీయ సంగీత దిగ్గజం, ఆస్కార్‌ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో  చెన్నైలోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. తెలుస్తున్న సమాచారం మేరకు రెహమాన్‌ను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. అక్కడ ఆయనకు యాంజియోప్లాస్టీ చేస్తున్నారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలు చేశారు.

ప్రస్తుతం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

|| திடீர் நெஞ்சுவலி காரணமாக, சென்னை அப்பல்லோ மருத்துவமனையில்
இசையமைப்பாளர் ஏ.ஆர்.ரகுமான் அனுமதி

அவசர சிகிச்சை பிரிவில் அனுமதிக்கப்பட்டுள்ள ஏ.ஆர்.ரகுமானுக்கு ஆஞ்சியோ சிகிச்சை,
மருத்துவர்கள் குழு தீவிர கண்காணிப்பு … pic.twitter.com/WnAzZ44iFX

— Thanthi TV (@ThanthiTV)

Latest Videos

భారతీయ, ప్రపంచ సంగీతానికి రెహమాన్ చేసిన సేవలకు గాను ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్తతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  

ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించారు. ఇండియన బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలిచారు. `స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌` చిత్రానికి ఏకంగా ఆస్కార్‌ అవార్డుని సైతం అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్‌ అందుకున్న తొలి ఇండియన్‌ టెక్నీషియన్ గా రికార్డు సృష్టించారు రెహ్మాన్‌. 

ప్రేమ కథా చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి అలరించారు రెహ్మాన్‌. ఇండియన్‌ శ్రోతలను ఉర్రూతలూగించారు. ఆ మధురమైన సంగీతంలో మునిగితేలేలా చేశారు. `రోజా`, `బాంబే`, `జెంటిల్ మేన్‌`, `భారతీయుడు` వంటి అనేక చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్‌ అందించి మెప్పించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతోపాటు ఇంగ్లీష్‌, పర్షియన్‌, మాండరిన్‌ వంటి భాషల చిత్రాలకు సంగీతం అందించారు. 

రెహ్మాన్‌ రెండు ఆస్కార్‌ అవార్డుతోపాటు ఆరు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. రెండు గ్రామీ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు, 18 ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2000లో పద్మశ్రీ పురస్కారం, 2020లో పద్మ భూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే ఇటీవల రెహ్మాన్‌ తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 29ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. 

read more: గౌతమ్‌ హీరోగా మహేష్‌ బాబు, కృష్ణలతో సినిమా.. స్టార్‌ డైరెక్టర్‌ మైండ్‌ బ్లాక్‌ చేసే ప్లాన్‌, కానీ

also read: ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా, శివాజీ ఎమోషనల్‌.. ఇక నా టైమ్‌ మొదలైంది

 

click me!