Ranya Rao Case: డీజీపీ కార్‌లోనే గోల్డ్ స్మగ్లింగ్? రన్యా రావ్‌ కేసులో షాకింగ్‌ నిజాలు బట్టబయలు

Published : Mar 15, 2025, 11:54 AM IST
Ranya Rao Case: డీజీపీ కార్‌లోనే గోల్డ్ స్మగ్లింగ్? రన్యా రావ్‌ కేసులో షాకింగ్‌ నిజాలు బట్టబయలు

సారాంశం

Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కోసం ప్రభుత్వ కారును కూడా నటి రన్యా రావ్ వాడుండొచ్చని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు అనుమానిస్తున్నారు.

Ranya Rao: తన సవతి తండ్రి, డీజీపీ పేరును వాడుకుని ఎయిర్‌పోర్టులో ప్రోటోకాల్ తీసుకోవడమే కాకుండా, బంగారం స్మగ్లింగ్ కోసం ప్రభుత్వ కారును కూడా నటి రన్యా రావ్ వాడుండొచ్చని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు అనుమానిస్తున్నారు. మార్చి 3న దుబాయ్ నుంచి సాయంత్రం వచ్చిన రన్యా రావ్ ను తీసుకురావడానికి ప్రైవేట్ వెహికల్ వచ్చింది.

అయితే అంతకుముందు చాలాసార్లు రన్యాను తన సవతి తండ్రి, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, డీజీపీ రామచంద్ర రావు గారి ప్రభుత్వ కార్లో పిక్ అండ్ డ్రాప్ చేశారని తెలిసింది. దీంతో తన తండ్రి అధికారాన్ని వాడుకుని ప్రభుత్వ వాహనంలోనే ఆమె బంగారం తరలించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే రన్యా ట్రావెల్ హిస్టరీని తీసుకుని డీఆర్ఐ చెక్ చేసింది. ఈ వ్యవహారంతో డీజీపీ ప్రభుత్వ కారు డ్రైవర్లకు డీఆర్ఐ విచారణ ఎదురుకావచ్చని సమాచారం.

 రన్యాను పికప్ చేసుకోవడానికి వచ్చిన కారు ఏది?: దుబాయ్ లో తనకు బంగారం ఇచ్చి, దాన్ని బెంగుళూరు ఎయిర్ పోర్ట్ రోడ్డులోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటోలో పెట్టమని కొందరు చెప్పారని డీఆర్ఐ విచారణలో రన్యా చెప్పింది. అందుకే ఎయిర్ పోర్ట్ నుంచి ఆమెను పికప్ చేయడానికి వచ్చిన వాళ్ల గురించి సమాచారం చాలా ముఖ్యం. మార్చి 3న రాత్రి 7 గంటలకు దుబాయ్ నుంచి ఫ్లైట్ లో వచ్చిన రన్యాను తీసుకుని వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కు ఒక ప్రైవేట్ కారు వచ్చింది.

అయితే ఆమెను అరెస్ట్ చేశాక ఆ కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఐ అతడి కోసం వెతుకుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరే ముందు, ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే రన్యనే ప్రైవేట్ కారును బుక్ చేసుకుందా, లేక రన్యాను తీసుకుని రావడానికి ఆమె సవతి తండ్రి రామచంద్ర రావు కారు పంపించారా అనేది తెలియదు. అంతేకాదు, రన్యాను ఎయిర్ పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి స్మగ్లర్లు కూడా కారు పంపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే ఆ రోజు ఆమెను తీసుకుని రావడానికి వచ్చిన కారు డ్రైవర్ విచారణ చాలా ముఖ్యం అని సమాచారం.

రాష్ట్ర పోలీస్ శాఖలో డీఐజీ స్థాయి అధికారులకు రెండు కార్లు, ఒక బైక్ ను ప్రభుత్వం ఇస్తుంది. భోజనం తీసుకురావడానికి, బ్యాంకు పనుల కోసం బైక్ ను వాడుతారు. ఒక కారును అధికారి వాడితే, ఇంకోటి వాళ్ల ఇల్లుగానీ,  ఆఫీస్ దగ్గర గానీ ఉంటుంది. ఈ అదనపు కారును అధికారి కుటుంబ సభ్యులు వాడుకుంటారు అని సమాచారం.

బ్యాగులో ఉంటే చెక్ చేయరు: ఆఫీసర్‌ భయానికి వాళ్ల పిల్లలు తెచ్చే బ్యాగులు, సూట్ కేసులను డ్రైవర్లు చెక్ చేయరు. అందుకే ఎయిర్ పోర్ట్ కు రన్యాను పికప్ అండ్ డ్రాప్ చేయడానికి వెళ్లిన డ్రైవర్లకు కూడా బంగారం స్మగ్లింగ్ గురించి తెలిసుండకపోవచ్చు అని అనుకుంటున్నారు.

తప్పుడు కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం, జైలు అధికారులకు నటి లెటర్?: ‘నేను బంగారం స్మగ్లింగ్ చేయలేదు. ఎవరినో కాపాడటానికి నా మీద తప్పుడు కేసు పెట్టి ఇరికించారు’ అని జైలు అధికారులకు నటి రన్యా రావ్ లెటర్ రాసిందని అంటున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రన్యా రావ్ ఉంది.

మొదట డీఆర్ఐ విచారణలో ఎవరో చెబితే దుబాయ్ నుంచి బంగారం తెచ్చానని చెప్పిన ఆమె, ఇప్పుడు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటోంది.  అంతేకాదు, రన్యా రావ్ లెటర్ ను డీఆర్ఐకి జైళ్ల శాఖ అధికారులు పంపించారు. కానీ ఈ లెటర్ గురించి జైళ్ల శాఖ అధికారులు కన్ఫర్మ్ చేయలేదు. నేను దుబాయ్ కు రియల్ ఎస్టేట్ పని మీద వెళ్లాను. అక్కడి నుంచి మార్చి 3న తిరిగి వస్తుంటే నేను బంగారం తేలేదు. కానీ ఎవరినో కాపాడటానికి నన్ను బంగారం స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. దీని గురించి విచారణ చేసి నాకు న్యాయం చేయమని రన్యా కోరిందని సమాచారం.

read  more: Ranya Rao Case: నటి రన్యా రావ్ కి కోర్ట్ షాక్‌, బెయిల్ పిటిషన్ కొట్టివేత

also read: చిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్‌ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే