Chiranjeevi
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన నటించే హీరోయిన్లకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వినిపిస్తుంది. ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అదేంటో చూద్దాం.
Chiranjeevi, anil ravipudi
అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇది ఓ రకంగా ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. దీంతో అదే ఊపులో చిరంజీవికి కథ చెప్పాడు అనిల్. మెగాస్టార్ కూడా మరో ఆలోచన లేకుండా ఓకే చేశాడు. అయితే `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకంటే ముందే చిరుతో సినిమాకి చర్చలు నడిచాయి. రిలీజ్ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది.
anil ravipudi
ప్రస్తుతం పూర్తి కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. ఇటీవలే తన సెంటిమెంట్ అయిన వైజాగ్‌లో ఫస్టాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేశాడట. చిరంజీవి `గ్యాంగ్ లీడర్` స్టయిల్‌లో మూవీ సాగుతుందని, చిరంజీవి పాత్ర కూడా అలానేఉంటుందని తెలుస్తుంది. అందులో రాజా రామ్‌గా చిరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీలోనూ అదే స్టయిల్, మ్యానరిజంతో క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి.
megastar chiranjeevi
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. హీరోయిన్ ఎవరనేది చర్చలు నడుస్తున్నాయట. అందులో భాగంగా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ హీరోయిన్ భూమిక, అలాగే అదితి రావు హైదరీ పేర్లని దర్శకుడు అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నారట. వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
bhumika
భూమికతో ఆల్‌రెడీ ఓ సినిమా చేశాడు చిరంజీవి. `జై చిరంజీవా`లో చిరుకి భార్యగా నటించింది భూమిక. ఇది 2005లో విడుదలైంది. కరెక్ట్ గా ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి జోడీ కట్టబోతున్నారని చెప్పొచ్చు. ఇక అదితి రావు హైదరీ.. చిరుతో ఇప్పటి వరకు మూవీ చేయలేదు. ఆమెకిది ఫస్ట్. మరి వీరిద్దరిలో అనిల్ ఎవరిని ఫైనల్ చేస్తాడు? ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేస్తాడా? అనేది చూడాలి.
anil ravipudi
ఈ సినిమాలో రమణ గోగుల పాటలు పాడబోతున్నాడట. `సంక్రాంతికి వస్తున్నాం`లో గోదారి గట్టు సాంగ్ ఎంతగా ఊపేస్తుందో తెలిసిందే. అలాంటిది మరో సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని జూన్‌లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి. కానీ ఈ ప్రాజెక్ట్ పై మెగా అభిమానులు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు.
read more: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్ సాంగ్ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది