- Home
- Entertainment
- Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్ మరో భారీ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే వాహ్ అనాల్సిందే.. లోకేష్ కాదు
Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్ మరో భారీ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే వాహ్ అనాల్సిందే.. లోకేష్ కాదు
Prabhas: ప్రభాస్ చేతిలో ఇప్పటికే మూడు, నాలుగేళ్లకి సరిపడ సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యిందట. హోంబలే వాళ్లతో ఆ దర్శకుడు అడ్వాన్స్ ఇప్పించాడట. ఆ కథేంటో చూద్దాం.

Prabhas
Prabhas: ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. దాదాపు ఆరేడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికే ఇంకా నాలుగైదు ఏళ్లు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించే అవకాశం ఉంది. మరి ఈ మూవీకి దర్శకుడెవరో చూద్దాం.
the raja saab
ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలే చేస్తున్నారు. `ది రాజాసాబ్`, `ఫౌజీ` షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో `స్పిరిట్` మూవీ చేయనున్నారు. అనంతరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు `సలార్ 2`, `కల్కి 2` సినిమాలు చేయాలి ప్రభాస్. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ ఓ సినిమాని తెరకెక్కించనుందని సమాచారం.
prabhas
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా ఓకే అయ్యిందట. హోంబలే ప్రొడక్షన్‌లోనే ప్రభాస్ మరో సినిమాకి కమిట్ అయ్యారట. ఈ లెక్కన ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ లో ప్రభాస్ నాలుగు సినిమాలు చేయబోతున్నారని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ సగం సినిమాలు ఆ ప్రొడక్షన్ వద్దే ఉన్నాయి. ఓ రకంగా డార్లింగ్ వారి గుప్పెట్లో ఉన్నారని చెప్పాలి.
Prabhas, Multi-Layered, Fauji, Hanu Raghavapudi
మరి హోంబలేలో లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు కాకుండా చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఏంటి? దీనికి దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరో కాదు `ఫౌజీ` దర్శకుడు హను రాఘవపూడి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో `ఫౌజీ` చిత్రీకరణ నడుస్తుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు హను. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుంది.
Hanu Raghavapudi , Prabhas
ఈ క్రమంలో వీరి మధ్య అండర్‌స్టాండింగ్ బాగా కుదిరిందని, హను రాఘవపూడి మరో లైన్ చెప్పాడని, ప్రభాస్‌తో సినిమా చేయడానికి హను రాఘవపూడి హోంబలేతో డార్లింగ్‌కి అడ్వాన్స్ ఇప్పించారని సమాచారం. ఇందులో నిజమెంతా? నిజమైతే ఈ మూవీఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. `ఫౌజీ`ని అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
read more: నాగార్జున, మహేష్ బాబు కలిసి నటించాల్సిన మల్టీస్టారర్ ఏంటో తెలుసా? దర్శకుడు హ్యాండివ్వడంతో మిస్