మీరు ఎప్పటికీ అందంగా ఉండాలా? అయితే పెళ్లి చేసుకోకండి.. బాలయ్య హీరోయిన్‌ సంచలన స్టేట్‌మెంట్‌

Published : Mar 18, 2025, 07:10 AM IST

Vedika: బాలకృష్ణతో `రూలర్‌` చిత్రంలో నటించి మెప్పించిన హీరోయిన్‌ వేదిక.. 18 ఏళ్లకే హీరోయిన్‌గా పరిచయమై ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఆమె అందం, పెళ్లి గురించి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. 

PREV
15
మీరు ఎప్పటికీ  అందంగా ఉండాలా? అయితే పెళ్లి చేసుకోకండి.. బాలయ్య హీరోయిన్‌ సంచలన స్టేట్‌మెంట్‌
Vedika

Vedika: ముంబైలో పుట్టి పెరిగిన నటి వేదిక. మోడలింగ్ రంగంలో దృష్టి పెట్టిన ఆమెకి అర్జున్ హీరోగా నటించిన `మద్రాసి` చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది.

25
Vedika

ఆ తర్వాత `సక్కరకట్టి`, `మలై మలై`, `పరదేశి`, `కావ్య తలైవ`న్, `కాంచన 3`, `పేట రేప్` చిత్రాల్లో నటించారు. `ముని` తర్వాత `పరదేశి` హిట్ అయింది. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటించారు. తెలుగులోకి `విజయదశమి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. `బాణం`, `దగ్గరగా దూరంగా` చిత్రాల్లో నటించింది. `బాణం`ఆమెకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. 

35
Vedika

బాలకృష్ణతో `రూలర్‌` చిత్రంలో నటించింది. కానీ అది ఆడలేదు. ఇక చివరగా వేదిక `రజాకార్‌`, `ఫీయర్‌` చిత్రాల్లో నటించింది. అలరించింది. చివరిగా ప్రభుదేవా నటించిన 'పేట రేప్' చిత్రంలో నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం `కనా` అనే కన్నడ చిత్రం, `గజానా` అనే తమిళ చిత్రం ఉన్నాయి.

45
Vedika

వేదిక సినిమా రంగంలోకి వచ్చి 19 ఏళ్లు అవుతున్నా, ఇంకా మొదటి సినిమాలో చూసినట్లే ఉన్నారు. ఇరవై ఏళ్లు అయినా ఆమెలో మార్పు లేదు. అంతే అందంగా ఉంది. ఇంకా అందం పెరుగుతుంది.  దీని గురించి అడిగినప్పుడు... ఇంకా పెళ్లి కాలేదని సమాధానమిచ్చారు.

55
Vedika

అలాగే చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. అందాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి పెళ్ళే వద్దనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

read  more: విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, టేస్టీ తేజ, హర్ష సాయి, సుప్రితలపై కేసులు.. పల్లవి ప్రశాంత్‌ కూడా ఈ స్కామ్‌లో?

also read: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్‌ సాంగ్‌ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories