MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • `కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌, 1000కోట్ల మూవీ లోడింగ్‌

`కూలీ`లో అమీర్ ఖాన్ లుక్ ఇదే.. ఫోటో షేర్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌, 1000కోట్ల మూవీ లోడింగ్‌

Aamir khan-Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'కూలీ' సినిమాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటిస్తుండగా, ఆయన లుక్‌ను చూపిస్తూ లోకేష్ కనగరాజ్ ఫోటో విడుదల  చేయడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 14 2025, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Coolie

Coolie

Aamir khan-Coolie:దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌తో కలిసి భారీ తారాగణమే నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కూలీ సినిమాలో నటిస్తున్న ప్రముఖులు

కూలీ సినిమాలో నటిస్తున్న ప్రముఖులు

 శృతి హాసన్, టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున, కట్టప్ప సత్యరాజ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా జాబితా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

`జైలర్` విజయం తర్వాత రజనీకాంత్ మళ్లీ సన్ పిక్చర్స్ సంస్థతో చేతులు కలపడంతో ఈ సినిమాలో నటించేందుకు రజనీకాంత్‌కు మాత్రమే రూ.200 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ.50 కోట్లు పారితోషికంగా ఇచ్చారట.

 

34
జైలర్ చిత్రంలా ఆగస్టును గురిపెట్టిన కూలీ

జైలర్ చిత్రంలా ఆగస్టును గురిపెట్టిన కూలీ

ప్రస్తుతం వరకు విడుదల తేదీ గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ, `జైలర్` చిత్రాన్ని విడుదల చేసిన విధంగానే ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు నెలలో విడుదల చేయాలని రజనీకాంత్ చిత్రబృందానికి చెప్పారట. దీనికి చిత్రబృందం కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రం గురించి తరచుగా ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. అందులో భాగంగా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని సిక్కిడి సిక్ పాట ప్రోమో విడుదలైంది.

44
అమీర్ ఖాన్ లుక్

అమీర్ ఖాన్ లుక్

అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పూజా హెగ్డే ఆడిన పాట టీజర్ గానీ, సినిమా టీజర్ విడుదల అవుతుందని ఎదురు చూసిన తలైవర్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా, ఈరోజు అమీర్ ఖాన్ తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, అమీర్ ఖాన్ కూలీ సినిమా లుక్‌ను చూపిస్తూ లోకేష్ కనగరాజ్ షూటింగ్ స్పాట్‌ పిక్‌ ని పంచుకున్నారు. 

ఇందులో అమీర్ ఖాన్‌తో జరిగిన డిస్కషన్‌లో తీసుకున్న ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అమీర్‌ ఖాన్‌ లుక్‌ అదిరిపోయింది. దీన్ని బట్టి నెటిజన్లు స్పందిస్తూ వెయ్యి కోట్ల సినిమా లోడింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

read more: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు, సుప్రిత ఏం తప్పు చేసిందో తెలుసా?

also read: Prabhas: హోంబలే బ్యానర్‌లో ప్రభాస్‌ మరో భారీ మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. లోకేష్‌ కాదు

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తమిళ సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved