ఆషురెడ్డి ప్రైవేట్ పార్ట్స్ పై పబ్లిక్ లో వర్మ బూతు కామెంట్.. కోపంతో చెంప చెళ్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ

First Published Sep 3, 2021, 8:59 AM IST

రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చుని కాఫీ ఎంజాయ్ చేస్తున్న ఆషురెడ్డి వద్దకు వెళ్లిన వర్మ, ఆమె ప్రైవేట్ పార్ట్స్ నచ్చాయంటూ పచ్చి కామెంట్ చేశారు. దానితో కోపంగా ఆర్జీవీ చెంపపై కొట్టింది ఆమె. 


ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్ర పట్టదు. విషయం ఏదైనా మీడియా తన గురించి మాట్లాడుకోవాలని వర్మ కోరుకుంటారు. చాలా కాలంగా వర్మ ఇదే తీరు ఫాలో అవుతున్నా, ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉండడంతో మీడియాకు, జనాలకు విసుగు రావడం లేదు. 
 


చిరంజీవి బర్త్ డే నాడు మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టేలా వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. మెగా హీరోలలో మెగా స్టార్ తరువాత అంతటి స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని, అల్లు అర్జున్ స్టార్ కావడం అసలు చిరంజీవికే పెద్ద షాక్ అంటూ అనేక కామెంట్స్ చేశారు. 
 

Latest Videos


అలాగే నటి జ్యోతి, ఇనయా సుల్తానాలతో తాగి, వర్మ చేసిన డాన్స్ లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇది ఓ వివాదంగా కొన్నిరోజులు నడిచింది. కొన్ని చౌకబారు ఛానెల్స్ వర్మను పిలిచి దీనిపై డిబేట్ పెట్టాయి. 

కొత్తగా పవన్ పుట్టినరోజును క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశాడు వర్మ. పవన్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకునే ఆషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ ప్రోమోలు విడుదల చేశారు. పవన్ గర్ల్ ఆషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. 
 


దానిలో భాగంగా నిన్న ఓ ప్రోమో విడుదల చేశారు. కాఫీ షాప్ లో కూర్చున్న ఆషురెడ్డిని వర్మ పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వర్మ ఎవరో నాకు తెలియదన్న ఆషురెడ్డి, నేను సినిమాలు పెద్దగా చూడనని చెబుతుంది. 

నేను ఇక్కడ కూర్చోవచ్చా.. అని అషురెడ్డిని అడిగిన వర్మ, కాసేపటి తరువాత నీ థైస్ బాగున్నాయని ఆమెతో బోల్డ్ కామెంట్ చేస్తాడు. దానితో కోపంగా వర్మ చెంపపై కొడుతుంది ఆమె. 
 


ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. కాంట్రవర్సీ సినిమాలు తగ్గించిన వర్మ, బుల్లితెర యాంకర్స్ , నటులతో బోల్డ్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అరియనాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన వర్మ, తాజాగా ఆషురెడ్డితో మరో బోల్డ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. 
 

click me!