తీర్దంలో మత్తు కలిపి రేప్ చేసారంటూ పూజారిపై టీవీ యాంకర్ కేసు

First Published May 16, 2024, 11:06 AM IST

ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు చెందిన మహిళా యాంకర్ తనకు మత్తుమందు కలిపిన ‘తీర్థం’ తాగించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ...

rape


ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు చెందిన మహిళా యాంకర్ తనకు మత్తుమందు కలిపిన ‘తీర్థం’ తాగించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ నగరంలోని ప్రముఖ అమ్మన్ ఆలయ పూజారిపై చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం సెన్సేషన్ గా మారింది. 
 

rape


తమిళనాడు చెన్నైకు చెందిన విరుగంబాక్కం పోలీసులు ఆలయ పూజారిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు, అతను లివ్ ఇన్ పార్టనర్ ని వ్యభిచారంలోకి నెట్టడానికి ప్రయత్నించాడు మరియు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారనే కేసు నమోదు అయ్యింది. ఆమె ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తోంది. అసలేం జరిగింది. పోలీస్ రిపోర్ట్ లో ఏముంది వంటి  వివరాల్లోకి వెళితే...

rape


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలిగ్రామానికి చెందిన బాధితురాలు దివ్య (30 (పేరు మార్చాం))  తాను ఆధ్యాత్మికంగా మక్కువ ఉన్న మహిళ కావడంతో చెన్నైలోని ప్యారీస్‌ కార్నర్‌లో ఉన్న ప్రముఖ ఆలయానికి వచ్చేది.   దివ్య  ఓ  ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఉద్యోగం కోసం 2021లో చెన్నైకి వచ్చింది. అప్పుడే కార్తీక్ మునుసామితో తనకు పరిచయం ఏర్పడిందని పేర్కొంది.


ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దాంతో  ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆమె సిటీలోని ప్రముఖ అమ్మన్ ఆలయకు వెళ్లి వస్తూండేది. ఆ  ఆలయాన్ని సందర్శించిన సమయంలో, పూజారి కార్తీక్ మునుసామితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

rape


 దివ్యకు ప్రత్యేక దర్శనానికి సహాయం చేస్తాననే నెపంతో కార్తీక్ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. వారి స్నేహం పెరిగింది . మెల్లిగా ఆ పరిచయం పెరిగి  అతను ఆమెను తన గుడిపనులు పూర్తయ్యాక ఆమెను ఇంటికి వదిలివేయడం ప్రారంభించాడు. 
 


ఆ తర్వాత కార్తీక్ మునుసామి ఆ మహిళకు ఆలయంలో జరిగే ప్రసంగాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్నాడు. వీరిద్దరూ స్నేహం చేయడంతో ఆ మహిళ ఆలయానికి వెళ్లినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం కల్పించారు.

rape


రోజులు గడిచేకొద్దీ, కార్తీక్ మునుసామి ఆమె రోజు కలుస్తూండే స్నేహితులు అయ్యారు.  ఒకరోజు ఆమె ఆలయానికి వెళ్లినప్పుడు, ఆమె ఇంటి కు వెళతానని చెప్పి ఆమెను తన బెంజ్ కారులో తీసుకెళ్లాడు. అప్పుడు అతను ఆమెకు మత్తుమందు కలిపిన 'తీర్థం' అందించాడు. మద్యం సేవించి స్పృహతప్పి పడిపోయిన ఆమెపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గుడిలో పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు.
 

కానీ పెళ్లి చేసుకోలేదు. దాంతో ఆ మహిళ కార్తీక్‌ను నిలదీస్తే ఎప్పటికప్పుడు పెళ్లే చేసుకుందామని వాయిదా వేసుకుంటూ, హామీ ఇస్తూ వచ్చాడు. అలాగే అతనికి అప్పటికే పెళ్లైంది. అయితే  తన భార్య నుండి విడిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులుకు ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు, కాలక్రమేణా ఆమె గర్భవతి అయింది. కార్తీక్ గతేడాది ఫిబ్రవరిలో ఆమెను వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బిడ్డకు అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు.

అయితే ఆమె ఒప్పుకోలేదు. అయితే ఏదో సాకుతో ఆమెను వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత అతను తనను లైంగిక పనికి కూడా బలవంతం చేశాడని చెప్పింది. అతను నన్ను బలవంతంగా సెక్స్ వర్క్‌లోకి నెట్టాడని ఆమె ఆరోపించింది.

rape

ఆమె ఇప్పుడు ఓ ప్రైవేట్ టీవీ షో యాంకర్ గా చేస్తోంది. ఆమె  ఇచ్చిన ఫిర్యాదు మేరకు విరుగంబాక్కం మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం ఆలయ పూజారి కార్తీక్ మునుసామి బాలికతో ఉన్న ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. పోలీసులు కార్తీక్ మునుసామిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

click me!