రామ్ చరణ్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం!

Published : May 31, 2024, 04:03 PM ISTUpdated : May 31, 2024, 04:34 PM IST
రామ్ చరణ్ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం!

సారాంశం

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెద్దకాపు కన్నుమూశారు. ప్రముఖులు, సన్నిహితులు సంతాపం ప్రకటిస్తున్నారు.   


చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు కన్నుమూశారు. తండ్రి మరణంతో బుచ్చిబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు మరణవార్త తెలుసుకున్న సన్నిహితులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తమ సానుభూతి తెలియజేస్తున్నారు. 

దర్శకుడు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జంటగా నటించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన భారీ విజయం సాధించింది. ఉప్పెన రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో చిత్రమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. 

రామ్ చరణ్ 16వ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ డ్రామాగా ఆర్సీ 16 తెరకెక్కనుందని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?