మోడీ నేను ఒకలా ఉంటాము.. బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన సత్యరాజ్!

Published : May 30, 2024, 07:11 PM IST
మోడీ నేను ఒకలా ఉంటాము.. బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన సత్యరాజ్!

సారాంశం

నటుడు సత్యరాజ్ మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

కోలీవుడ్ నటుడు సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అన్నింటికీ మించి బాహుబలి చిత్రాల్లో ఆయన చేసిన కట్టప్ప పాత్ర ఎన్నటికీ నిలిచిపోతుంది. బాహుబలి సక్సెస్ లో ఆయన పాత్ర చాలా కీలకం అయ్యింది. కాగా సత్యరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సత్యరాజ్ స్పందించారు. 

ఆయన నటించిన వెపన్ మూవీ జూన్ 7న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగం టాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. మోడీ బయోపిక్ లో నటిస్తున్నారట కదా... అని అడగ్గా, అవి పుకార్లే అని కొట్టి పారేశాడు. నేను చూడటానికి మోడీలా ఉంటాను అందుకే ఆ పుకారు పుట్టి ఉండవచ్చు అన్నారు. మోడీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఈ వేదికగా సత్యరాజ్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి సినిమాలో నటించడం వలన నాకు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది. ఆ చిత్రంలో ఆఫర్ ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అన్నారు సత్యరాజ్. రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని సత్యరాజ్ చెప్పుకొచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా