ప్రియుడితో బ్రేకప్.. ఒంటరైన శృతి హాసన్ ఏం చేస్తుందో తెలుసా?

Published : May 30, 2024, 07:52 PM IST
ప్రియుడితో బ్రేకప్.. ఒంటరైన శృతి హాసన్ ఏం చేస్తుందో తెలుసా?

సారాంశం

ఇటీవల ప్రియుడు శాంతను హాజరిక తో విడిపోయింది శృతి హాసన్. ఒంటరి అయిన శృతి హాసన్ చేస్తున్న పనులు ఆవేదన కలిగిస్తున్నాయి.   

అధికారికంగా ఇద్దరు లవర్స్ కి బ్రేకప్ చెప్పింది శృతి హాసన్. గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో చెట్టపట్టాలేసుకుని తిరిగింది. అతన్ని ఇండియాకు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. మైఖేల్ లో శృతి హాసన్ పెళ్లి ఖాయమే అనుకున్నారు అందరు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్ళు విరహ వేదన అనుభవించింది. 

కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమాయణం మొదలుపెట్టింది. ముంబైలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేశారు. శాంతను-శృతి హాసన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. అతనితో ఉన్న తన ప్రతి జ్ఞాపకాన్ని శృతి హాసన్ షేర్ చేసుకునేది. శాంతనుతో త్వరలో పెళ్లి అనుకుంటుంటే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. ఇటీవల ఇద్దరూ విడిపోయారు. శాంతను తో దిగిన ఫోటోలు శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ నుండి తొలగించింది. 

ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్ తాను సింగిల్ అని, ఇకపై మింగిల్ అయ్యేది లేదని చెప్పింది. మరి మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతుందో ఏమో కానీ ట్రాజెడీ సాంగ్స్ పాడుకుంటుంది. తన హృదయపు తలుపులు మూసేసిందట. ఇక ఎవరి కోసం తెరిచేది లేదని అర్థం వచ్చేలా ఇంగ్లీష్ సాంగ్స్ పాడుకుంటుంది. శృతి హాసన్ వీడియో వైరల్ అవుతుంది. 

సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత శృతి హాసన్ కి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. నెక్స్ట్ సలార్ 2లో శృతి హాసన్ కనిపించనుంది. అలాగే అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?