Today Horoscope: ఓ రాశివారు ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది

First Published | Jun 1, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology


1-6-2024  శనివారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. సంపాదనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి.  

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-ఉద్యోగులకు శ్రమ అధికం. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలొస్తాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీస్తుంది.  పనులు సాధారణంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. 


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో  కలహాలు వచ్చే అవకాశముంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ కలహాల వల్ల ఒత్తిడికి గురవుతారు. డబ్బులు అనవసరంగా ఖర్చవుతాయి. 
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఒక ముఖ్యమైన విషయం  గురించి పెద్దలతో చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న మొండి బాకీలు వసూలవడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- వ్యాపారులకు ఈ రోజు అంత బాగుండదు. సేవా కార్యక్రమాల్లో  పాల్గొనడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజూ ఏ ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఉద్యోగులు ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి ఈ రోజు కలిసి రాదు. చిన్న చిన్న విషయాలకు బంధువులతో తగాదాలొస్తాయి. ధన వ్యవహారాలు అంతగా ముందుకు సాగవు. ఉద్యోగులకు పై అధికారులతో   సమస్యలుంటాయి.  ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది. 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-  నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కోరకున్న ఉద్యోగం సాధిస్తారు.  నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఇది మీ ఖర్చును బాగా పెంచుతుంది. అధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు. ఉద్యోగులు ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. 
 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ధన మార్గాలు పెరుగుతాయి. భూమికి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు మీకు లాభం తెచ్చిపెడతాయి. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు మీకు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. బంధుమిత్రులతో విభేదాలొస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలకు వెళతారు. కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-  సంతానం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణంగా గొడవలొస్తాయి. పిల్లలకు చదువు ఒత్తిడి పెరుగుతుంది.  వ్యాపారులకు నష్టం వాటిల్లుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతారు. 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక వ్యక్తి సహాయంతో ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితుల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. 

Latest Videos

click me!