నిన్ను చాలా మిస్ అవుతున్నా నాన్న... మహేష్ బాబు ఎమోషనల్!

Published : May 31, 2024, 11:01 AM IST
నిన్ను చాలా మిస్ అవుతున్నా నాన్న... మహేష్ బాబు ఎమోషనల్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణను తలచుకుని ఎమోషనల్ అయ్యారు. నేడు కృష్ణ జయంతి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.   

సూపర్ స్టార్ కృష్ణ వెండితెర పై చెరగని ముద్ర వేసిన నటుడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యాడు. దాదాపు ఐదు దశాబ్దాలు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. ప్రయోగాత్మక చిత్రాలతో డేరింగ్ డాషింగ్ హీరో అనిపించుకున్నారు. నటుడిగా సంపాదించిన డబ్బులను కృష్ణ సినిమాల్లోనే పెట్టుబడిగా పెట్టేవారు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా సక్సెస్ అయిన అరుదైన వ్యక్తి. 

1943 మే 31 గుంటూరు జిల్లా తెనాలి వద్ద గల బుర్రిపాలెం అనే విలేజ్ కృష్ణ జన్మించారు. 2022 నవంబర్ 15న అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు ఆయన జయంతి నేపథ్యంలో అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ నటవారసుడు మహేష్ బాబు ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశాడు. 

''హ్యాపీ బర్త్ డే నాన్న. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. కానీ నా జ్ఞాపకాల్లో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు'' అని మహేష్ బాబు కామెంట్ చేశాడు. మహేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. కృష్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రమేష్ బాబు 2022లో మరణించారు. అదే ఏడాది కృష్ణ, ఆయన సతీమణి ఇందిరాదేవి కన్నుమూయడం జరిగింది. 

మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. బాల్యం నుంచే మహేష్ బాబును నటుడిగా కృష్ణ ప్రోత్సహించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు మల్టీస్టారర్స్, డ్యూయల్ రోల్స్ చేయడం విశేషం. రాజకుమారుడు చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారిన మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. మహేష్ బాబు అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన హీరో... 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్