ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరోసారి సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన.. ఇలా ఆడుకుంటున్నారేంటి?

Published : May 31, 2024, 11:13 PM IST
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరోసారి సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన.. ఇలా ఆడుకుంటున్నారేంటి?

సారాంశం

సమంత, నాగచైతన్యల విడాకుల మ్యాటర్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఈ జంట విడాకులు చర్చనీయాంశంగా మారుతుంది.   

స్టార్‌ జోడీ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితమే ఈ ఇద్దరు విడాకులు ప్రకటించారు. ఇద్దరూ తాము ఓ అండర్‌ స్టాండింగ్‌తోనే విడిపోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ ఇద్దరు విడిపోయే మూడేళ్లు అవుతుంది. ఎవరికి వాళ్లు తమలైఫ్‌లో బిజీ అయ్యారు. నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు సమంత విడాకుల అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యింది. 

సమంతని మయోసైటిస్‌ వ్యాధి వెంటాడింది. కొన్నాళ్లపాటు ట్రీట్మెంట్‌ తీసుకుని అనంతరం షూటింగ్‌లో పాల్గొంది. అయినా హెల్త్ సెట్‌ కాకపోవడంతో బ్రేక్‌ కూడా తీసుకుంది. ఏడాది బ్రేక్‌ అనంతరం ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది. ఆ మధ్యనే కొత్తగా ఓ మూవీని ప్రకటించింది. `మా ఇంటి బంగారం` పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కావడం విశేషం. ఇక సమంత లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తుందని అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దుమారం రేపింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల నాయకుల ఫోన్లతోపాటు సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారని అనేక వార్తలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షాలు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. తీన్‌ మార్‌ మల్లన్న కూడా దీనిపై విరుచుకుపడ్డాడు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఫోన్‌ ట్యాపింగే అనే ఆరోపణల చేశారు. కేటీఆర్‌ తెరవెనుక ఇదంతా చేయించారని ఆయన ఆరోపణ చేశారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. 

ఇప్పుడు మరో నాయకుడు సమంత, నాగచైతన్యల విడాకుల మ్యాటర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కి ముడిపెట్టారు. బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ఈ ఆరోపణల చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా సమంత, నాగచైతన్య విడిపోయారని ఆయన ఆరోపించారు. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తుందని, సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నాడని బూర నర్సయ్య గౌడ్‌ ప్రశ్నించారు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి సమంత, చైతూల విడాకుల మ్యాటర్‌ చర్చనీయాంశంగా మారుతుంది. 

ఇక నాగ చైతన్య.. ప్రస్తుతం `తండేల్‌` చిత్రంలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దసరాకి విడుదల కాబోతుంది. `లవ్‌ స్టోరీ` తర్వాత సాయిపల్లవితో మరోసారి రొమాన్స్ చేస్తున్నాడు చైతూ. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?