Virat Kohli T20 World Cup Records: టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతే కాదు, ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సగటుతో పాటు అత్యధిక 50+ స్కోరర్ గా కూడా ఘనత సాధించాడు.
Virat Kohli T20 World Cup Records: టీ20 వరల్డ్ కప్ 2024 ను అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా నిర్వహించడానికి ఐసీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత జట్టు మెగా టోర్నీ టైటిల్ పై కన్నేసింది. విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ టోర్నీ కానుంది. దీంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీ.. భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టి ఘనంగా టీ20 వరల్డ్ కప్ కెరీర్ ను ముగించాలని చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. ఇది మాత్రమే కాదు, ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సగటుతో పాటు అత్యధిక 50+ పరుగులు చేసిన బ్యాటర్ కూడా. కానీ, భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టడంలో విజయం సాధించలేకపోయాడు.
టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో మూడంకెల స్కోర్ ను సాధించలేకపోయాడు. ఐపీఎల్, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ సెంచరీ కరువును ముగించాలని చూస్తున్నాడు. ప్రస్తుత అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ టీ20వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.
undefined
6 ప్రపంచకప్‌లు.. కానీ ఒక్క సెంచరీ కూడా లేదు
విరాట్ కోహ్లీ 2012లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ కోహ్లికి బాగా కలిసొచ్చింది. అతను 5 మ్యాచ్‌లు ఆడి 185 పరుగులు చేశాడు, అందులో 78 నాటౌట్ అతని టాప్ స్కోర్, అలాగే రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అప్పటి నుండి, కోహ్లీ 2022 వరకు మరో 5 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు, కానీ అతను తన బ్యాట్‌తో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈ టోర్నీలో అతను 89 పరుగుల అత్యధిక స్కోర్ ను నమోదుచేశాడు, కానీ సెంచరీ చేయలేకపోయాడు. అయితే, కోహ్లి టీ20 ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్ మాత్రమే కాదు, ఏదైనా ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు.
ఈసారి సెంచరీ సాధిస్తాడా?
వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనున్న న్యూయార్క్ చేరుకుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో కోహ్లీ సెంచరీ చేయగలడు, ఎందుకంటే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అత్యధికంగా 741 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెంచరీ కూడా చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆడే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. ప్రస్తుతం అతడి ఫామ్‌ను పరిశీలిస్తే.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం పక్కాగా కనిపిస్తోంది.
T20 WORLD CUP 2024 లో భారత్-బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడాలి?