సినిమా చూస్తే స్నాక్స్ ఫ్రీ.. విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్!

By Udayavani DhuliFirst Published Nov 19, 2018, 4:51 PM IST
Highlights

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త పద్దతులు అవలంభిస్తుంటాడు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తన సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త పద్దతులు అవలంభిస్తుంటాడు.

ఈ సినిమా కోసం టాక్సీవాలాగా మారి కొందరికి తన కారులో రైడ్ ఇచ్చాడు. తాజాగా తన సినిమా చూసిన ఆడియన్స్ కోసం స్నాక్స్ ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ థియేటర్ లో సందడి చేసిన విజయ్ అప్పటికప్పుడు థియేటర్ లో ఉన్న ప్రేక్షకులందరికీ ఓ ఆఫర్ ఇచ్చాడు. సినిమా ఇంటర్వెల్ బ్రేక్ లో ఎంతైనా తినండి, బిల్లు నేను కడతా అంటూ ప్రకటించాడు.

''ఇది లాస్ట్.. మళ్లీ మిమ్మల్ని థియేటర్ లో కలవడానికి చాలా గ్యాప్ వచ్చేస్తోంది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మళ్లీ గట్టిగా కొట్టాం. మా టీం అంతా హ్యాపీ.. అందుకే మీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇంటర్వెల్ లో స్నాక్స్ ఎంత కావాలంటే అంత తినండి.. మొత్తం ఫ్రీ.. బిల్లు మొత్తం మేం కడతాం'' అంటూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.

విజయ్ ఆడియన్స్ కి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్ లో ఇవ్వడం ఇది మొదటిసారి కాదు.. గతంలో తనతో పాటు ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ కి తన వీరాభిమానిని తీసుకెళ్లాడు. అలానే తన పుట్టినరోజు నాడు సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఐస్ క్రీమ్ పంచాడు. 

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

click me!