రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?

Published : Nov 19, 2018, 04:15 PM IST
రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్.. ఈసారైనా హిట్టుకొడతాడా?

సారాంశం

గత కొంత కాలంగా ఊహించని అపజయాలతో సతమతమవుతోన్న మాస్ మహారాజ రవితేజ ఇటీవల అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కూడా రవితేజకు ఎలాంటి లాభాన్ని ఇవ్వలేకపోయింది. 

గత కొంత కాలంగా ఊహించని అపజయాలతో సతమతమవుతోన్న మాస్ మహారాజ రవితేజ ఇటీవల అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా కూడా రవితేజకు ఎలాంటి లాభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే మాస్ రాజా మాత్రం అవేమి పట్టించుకోకుండా అదే ఎనర్జీతో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం విఐ. ఆనంద్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఆ సినిమా మొన్న 13వ తేదీన ప్రారంభం కావాల్సింది. కానీ చిత్ర యూనిట్ ఎందుకో స్టార్ట్ చేయలేదు. ఇక ఈ నెల 22న ఎలాగైనా సినిమాను లాంచ్ చేయాలనీ నిర్మాతతో మాస్ రాజా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

స్కై ఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఎస్ఆర్ టి ఏంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇక ఈ సినిమా దర్శకుడికి కూడా చాలా అవసరం. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్టందుకున్నప్పటికీ ఆ తరువాత ఒక్క క్షణం సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో రవితేజ తో డిఫరెంట్ మూవీని చేసి హిట్ కొట్టాలని ఆనంద్ కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని సెలెక్ట్ చేశారు,.

PREV
click me!

Recommended Stories

Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌