టాప్ మూవీ న్యూస్: సాహూ కలెక్షన్స్ -సైరా రికార్డ్, యూవీ క్రియేషన్స్ రిస్క్

Published : Sep 05, 2019, 11:45 AM ISTUpdated : Sep 05, 2019, 08:57 PM IST
టాప్ మూవీ న్యూస్: సాహూ కలెక్షన్స్ -సైరా రికార్డ్, యూవీ క్రియేషన్స్ రిస్క్

సారాంశం

 సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

మళ్ళీ రిస్క్ చేసిన యూవీ క్రియేషన్స్.. సైరాకు రికార్డ్ ధర!

Record price for SyeRaa guntur rights

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. 

బన్నీ వాసుపై ఆరోపణలు, సునీతపై కేసు.. స్పందించిన గీతా ఆర్ట్స్!

Geetha Arts responds on junior Artist Sunitha allegations

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఫస్ట్ కామెంట్

సాహో సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులు చాలా వరకు సైలెంట్ గానే ఉన్నారు. విడుదలైన నాలుగురోజుల అనంతరం ఒకొక్కరు సినిమా రిజల్ట్ పై స్పందిస్తున్నారు.  ఇప్పటికే సుజిత్ తన వివరణ ఇవ్వగా ఇప్పుడు కథానాయకుడు ప్రభాస్ కూడా తన వివరణ ఇచ్చాడు. 

సల్మాన్ ఖాన్ వర్జినా..? నేనూ అంతే.. తమన్నా సింహాద్రి కామెంట్స్!

తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని.. సినిమాల్లో నటించి ఆ తరువాత మంచి పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలనుందని తెలిపింది.

'సాహో' 6 రోజుల కలెక్షన్స్.. ఇక అంతా అయిపోయింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో ప్రేక్షకులని అలరించడంలో విఫలమైంది.

దర్బార్ అనంతరం సూపర్ స్టార్ పొలిటికల్ ప్లాన్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా? అని వరల్డ్ వైడ్ గా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. అయితే గతంలోనే చాలా సార్లు తన పొలిటికల్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు. 

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక అదేనా.. చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ?

SyeRaa Prerelease event venue confirmed

సాహో చిత్రం విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న మరో భారీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు, హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. 

మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం..?

Nandamuri Mokshagna set for Tollywood debut

ఒకానొక సమయంలో 2017లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖయామని అన్నారు. కానీ ఇప్పుడు 2019 కూడా అయిపోతుంది. ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదనే ప్రచారం కూడా ఊపందుకుంది.

 

కన్యత్వంపై నెటిజన్ ప్రశ్న.. ఇలియానా షాకింగ్ రిప్లయ్!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

 

'వాల్మీకి' సినిమాలో కుర్ర హీరో గెస్ట్ రోల్!

వరుణ్ తేజ్-పూజాహెగ్డే కాంబినేషన్ లో డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా స్లోగా బజ్ పెంచుకుంటూ వస్తోంది. సినిమా విశేషాలు, స్టిల్స్ ఒక్కోటి బయటకు వస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతోంది. 

 

మ్యూజిక్ డైరక్టర్ కు యాక్సిడెంట్, సేవ్ చేసిన సాయి తేజ!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగీత దర్శకుడుని  సినీ హీరో సాయి దరమ్‌ తేజ్‌ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసారు. అయితే  ఆ సంగీత దర్శకుడు  ఆయన స్నేహితుడే కావడం గమనార్హం.

 

బిగ్ బాస్ 3: ఒకరినొకరు కొట్టేసుకుంటూ రచ్చ.. వారిద్దరికీ శిక్ష తప్పలేదు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 45 ఎపిసోడ్‌లను పూర్తి చేసి మంగళవారం నాటితో 46వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
 

ప్రమోషన్స్ తో విసుగెత్తానంటున్న 'సాహో' హీరోయిన్!

సాహో డ్యూటీ దిగగానే అదే ఛానెల్స్, అదే టాక్ షో లు, అదే డాన్స్ బేసెడ్ పోగ్రామ్ లలో  శ్రద్దా మళ్లీ కనిపిస్తూ అలరించాల్సన పరిస్దితి వచ్చింది. అలా సినిమా ప్రమోషన్స్ కోసం టీవి ఛానెల్స్ చుట్టూ వారాల తరబడి తిరగటం విసుగెత్తిందిట. ఈ విషయాన్ని ఆమే మీడియాతో అంది. ప్రమోషన్ అనే పదం వింటేనే ఇరిటేషన్ గా ఉంటోందని చెప్పుకొచ్చింది.  

PREV
click me!

Recommended Stories

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్