Asianet News TeluguAsianet News Telugu

వరస ప్రమోషన్స్ తో విసుగెత్తానంటున్న 'సాహో' హీరోయిన్!

‘సాహో’ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇక్కడ తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం సాధించటంతో ఆమె ఇక్కడ సుపరిచితురాలైంది.  

Shraddha Kapoor irritated with heavy promotions
Author
Hyderabad, First Published Sep 5, 2019, 10:25 AM IST

‘సాహో’ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇక్కడ తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం సాధించటంతో ఆమె ఇక్కడ సుపరిచితురాలైంది.  అలాగే నిర్మాతల కోరిక మేరకు దేశం మొత్తం తిరిగి సాహో చిత్రం ప్రమోట్ చేసింది. రిలీజ్ కు ముందు రోజు దాకా టీవీ ఛానెల్స్, లైవ్ షోలలో ఆమె నాన్ స్టాఫ్ గా పాల్గొంది. సినిమా రిలీజైంది. హిందీలో రివ్యూలు తేడాగా వచ్చినా, ఆమెకు పెద్జ మార్కులు పడకపోయినా నార్త్ లో ఆడటం ఆమెకు సంతోషాన్ని ఇచ్చింది. దాంతో సాహో కష్టం తీరిందనుకులోగా...మరో చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఈ వారం  ఆమె సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలసి నటించిన 'చిచ్చోరే' చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్  చేయాల్సిన పరిస్దితి వచ్చింది. దాంతో సాహో డ్యూటీ దిగగానే అదే ఛానెల్స్, అదే టాక్ షో లు, అదే డాన్స్ బేసెడ్ పోగ్రామ్ లలో  శ్రద్దా మళ్లీ కనిపిస్తూ అలరించాల్సన పరిస్దితి వచ్చింది. అలా సినిమా ప్రమోషన్స్ కోసం టీవి ఛానెల్స్ చుట్టూ వారాల తరబడి తిరగటం విసుగెత్తిందిట. ఈ విషయాన్ని ఆమే మీడియాతో అంది. ప్రమోషన్ అనే పదం వింటేనే ఇరిటేషన్ గా ఉంటోందని చెప్పుకొచ్చింది.  

చిచ్చోరే మూవీ వాస్తవానికి ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కావాల్సింది, సేమ్ డేట్ లో సాహో మూవీ రిలీజ్ కావడం తో ఆ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 6వ తేదీ కి పోస్ట్ పోన్ అయింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన రెండు మూవీస్ సాహో , చిచ్చోరే ఒక వారం గ్యాప్ లో రిలీజ్ కావడం తో తన సంతోషాన్ని శ్రద్ధా ప్రకటించారు. 

ఈ సంవత్సరమంతా సాహో, చిచ్చోరే, స్ట్రీట్ డాన్సర్ మూవీస్ కై పలు ప్రాంతాలకు తిరిగానని, తాను నటించిన రెండు మూవీస్ వారం గ్యాప్ లో రిలీజవడం ఫస్ట్ టైమ్ అని, రెండు మూవీస్ రిలీజ్ తో డబుల్ హ్యాపీ అని, ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానని, డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించిన చిచ్చోరే రిలీజ్ కై ఆతృతతో ఎదుచూస్తున్నానని శ్రద్ధా కపూర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios