భారీ అంచనాల మధ్య విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ సాహో మిశ్రమ స్పందన అందుకున్న విషయం తెలిసిందే. అయితే సాహో సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులు చాలా వరకు సైలెంట్ గానే ఉన్నారు. విడుదలైన నాలుగురోజుల అనంతరం ఒకొక్కరు సినిమా రిజల్ట్ పై స్పందిస్తున్నారు. 

ఇప్పటికే సుజిత్ తన వివరణ ఇవ్వగా ఇప్పుడు కథానాయకుడు ప్రభాస్ కూడా తన వివరణ ఇచ్చాడు. "డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ సాహో పై మీరు చూపించిన ప్రేమ అభిమానానికి చాలా కృతజ్ఞతలు మీ వల్లే ఈ సినిమా మంచి గుర్తింపు దక్కింది" అని సింపుల్ కామెంట్ తో ఆన్సర్ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర యూనిట్ సినిమా విడుదల అనంతరం చాలా వరకుప్రమోషన్స్ తగ్గించేసింది.