మంగళవారం నాటి ఎపిసోడ్ ఓ బిగ్ బాస్ ఇచ్చిన 'దొంగలు దోచిన నగరం' అనే టాస్క్ బుధవారం నాడు కూడా కంటిన్యూ అయింది. ఈ ఎపిసోడ్ లో హింస రెట్టింపు అయింది. టాస్క్ ప్రకారం శిల్పాని కుర్చీ నుండి కదిలించి.. ఆమె చేతిలో ఉన్న గన్ ను తీసుకొని ఆమెని జైలులో బంధించాలి.

దీంతో గేమ్ లో ఎలాగైనా గెలవాలని శిల్పా గన్ ని తన ఒంటికి గట్టిగా కట్టించుకుంది. ఆమె నుండి గన్ లాక్కునే క్ర్రమంలో అలీ, హిమజ, శ్రీముఖి, బాబా భాస్కర ఆమెతో ఓ ఆట ఆడేసుకున్నారు. వారి నుండి తప్పించుకునే క్రమంలో శిల్పా స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది. స్విమ్మింగ్ ఫూల్‌‌లో నుండి ఆమెను తీసుకువచ్చి జైలులో వేసేందుకు నగరవాసులుగా ఉన్న అలీ, బాబా భాస్కర్, మహేష్‌లు స్విమ్మింగ్ పూల్‌లో దూకి మరీ ఆమె బయటకి లాగడానికి ప్రయత్నించారు. 

దీంతో రవి.. శిల్పాని కాపాడడం కోసం ఆమెను పట్టుకుంటే.. అలీ ఆమెని లాగే ప్రయత్నంలో రచ్చ రచ్చ చేశాడు. తనను ఇష్టం వచ్చినట్లు హ్యాండిల్ చేయడంతో శిల్పా బాగా ఇబ్బంది పడింది. అలీ, రవి, రాహుల్ ల మధ్య కూడా గొడవ జరిగింది.

టాస్క్ లో హింస ఎక్కువవుతుందని భావించిన బిగ్ బాస్ గేమ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మీలో ఎవరు ఎక్కువ హింసకు పాల్పడ్డారో వెంటనే చెప్పాలని బిగ్ బాస్ కోరడంతో కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో రవి, రాహుల్ పేర్లను చెప్పారు. దీంతో బిగ్ బాస్ వారిద్దరినీ జైలుకి పంపారు.

ఇది ఇలా ఉండగా.. వరుణ్ సందేశ్, వితికాల మధ్య గొడవ చెలరేగింది. తనతో టైం స్పెండ్ చేయడం లేదని వితికా కన్నీళ్లు పెట్టుకోగా.. 24 గంటలు నీతోనే ఉంటున్నా.. ఇంకా టైం స్పెండ్ చేయడం ఏంటి..? అంటూ మండిపడ్డాడు వరుణ్. మనం గేమ్ ఆడటానికి వచ్చాం.. హనీమూన్ కి కాదంటూ అనడంతో వితికా వెక్కి వెక్కి ఏడ్చేసింది.