మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా తమిళ 'జిగర్తండా'కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మొదలైన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుండి ఈ సినిమాకి సంబంధించి ఏదొక వివాదం వస్తూనే ఉంది. సినిమా టైటిల్ కి సంబంధించిన ఇప్పటికీ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది.

రీసెంట్ గా కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ సీన్ లో సినిమా హీరో ఎవరైనా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తోన్న సమయంలో యంగ్ హీరో నితిన్ ని లైన్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ కూడా ఒప్పుకోవడంతో ఒకరోజులో అతడి రోల్ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

అంటే 'వాల్మీకి' సినిమా నితిన్ కామియో చూడొచ్చన్న మాట. అలానే దర్శకుడు సుకుమార్ కూడా సుకుమార్ ఈ చిత్రంలో లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని, వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే ఊహాగానాలువినిపిస్తున్నాయి.