ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా పోలీసులు సునీతకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫ్యాన్స్ లో సునీత బన్నీ వాసుపై విమర్శలు చేసింది. దీనిపై గీతా ఆర్ట్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. సునీత పేరు ప్రస్తావించకుండా జరుగుతున్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చారు. 

'గత కొన్ని రోజులుగా మేము ఓ మహిళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గీతా ఆర్ట్స్ ఆఫీస్ గేటు వద్ద, తమ షూటింగ్ లొకేషన్స్ వద్దకు వచ్చి అగ్రెసివ్ గా ప్రవర్తిస్తోంది. తమ చిత్రాల్లో క్యారెక్టర్ ఇమ్మని డిమాండ్ చేస్తోంది. దీనిపై విచారణ జరిపించేందుకు తాము పోలీస్ కేసు నమోదు చేశాం. ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశాం. 

తాము ఎదుర్కొంటున్న సమస్యని కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టిస్తూ.. వారికీ అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ వివాదంపై క్లారిటీ కావాలనుకునే వారు గీతా ఆర్ట్స్ సంస్థని, ఫిలిం ఛాంబర్ ని సంప్రదించవచ్చు అని గీతా ఆర్ట్స్ ప్రకటన విడుదల చేసింది. 

ఇందులో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదని, తాను ఆరోపణలు చేస్తోంది బన్నీ వాసుపై అని సునీత వీడియోలో తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా జనసేన, పవన్ కళ్యాణ్ ని ఈ వివాదంలోకి లాగుతున్నట్లు సునీత పేర్కొంది. 

 

అవకాశాలు ఇస్తామని జనసేన నేతలు... నటి ఆరోపణలు!