కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా? అని వరల్డ్ వైడ్ గా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. అయితే గతంలోనే చాలా సార్లు తన పొలిటికల్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు. 

ఎప్పటికప్పుడు సంకేతాలు పంపుతున్నప్పటికీ అభిమాన లోకానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే దర్బార్ సినిమా అనంతరం తైలవా తప్పకుండా రాజకీయ రంగం వైపు అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అలాగే శివ దర్శకత్వంలో కూడా సూపర్ స్టార్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కరెక్ట్ గా మంచి సందేశంతో కూడిన రెండు సినిమాలను ఆడియెన్స్ కి అందించి తన రెగ్యులర్ పొలిటికల్ కెరీర్ ను స్టార్ట్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి తలైవా తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారో చూడాలి.