సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది బాగా తగ్గిపోయింది. అభిమానులకు టచ్ లో ఉండాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను పంచుకోవడం మొదలుపెట్టారు.

తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా అభిమానులతో కాసేపు ముచ్చటించాలని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆస్కీ మీ ఎనీథింగ్ అనే సెషన్ మొదలుపెట్టి అభిమానులతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆమెని రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పిన ఇలియానాను ఓ నెటిజన్ 'మీరు మీ కన్యత్వాన్ని ఎప్పుడు కోల్పోయారు..?' అని ప్రశ్నించాడు.

దీనికి ఇలియానా.. 'ఈ విషయంలో మీ అమ్మ ఏం చెబుతుందో ముందు అడిగి తెలుసుకో' అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది ఇలియానా. బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తోంది. ప్రస్తుతం కొరటాల-చిరంజీవి సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.