బిగ్ బాస్ సీజన్ 3లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రవిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కూడా విసిగించాయి. అందుకే ఆమె ఎక్కువ రోజులు షోలో కొనసాగలేకపోయింది.

తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని.. సినిమాల్లో నటించి ఆ తరువాత మంచి పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలనుందని తెలిపింది.

సినిమా ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అని అనడం లేదని.. కానీ కొంతమని మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తారని.. తనకైతే ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని చెప్పింది.

తాను వర్జిన్ కాదని.. అబద్దాలు చెప్పడం రాదనీ వెల్లడించింది. 'సల్మాన్ ఖాన్ వర్జినా.. నేను కూడా అంతే' అంటూ 17 ఏళ్ల వయసులోనే కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. తను వర్జిన్ కాకపోయినా.. తన మనసు మాత్రం వర్జిన్ అంటూ చాలా బోల్డ్ గా మాట్లాడింది.