ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

By Udayavani DhuliFirst Published Dec 21, 2018, 2:27 PM IST
Highlights

సంచలన దర్శకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 

సంచలన దర్శకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. తాజాగా వర్మ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బాలయ్య 
వాయిస్ తో వర్మకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది.

దీనికి వర్మ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటుంది. ముందుగా బాలయ్య వాయిస్ తో.. ''ఒరేయ్ ఆర్జీవీ.. నాదగ్గర నేనున్నాను, విద్యాబాలన్ ఉంది, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, రానా దగ్గుబాటి, సుమంత్, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్ పుత్, రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ ఉన్నారు. మరి నీ సినిమాలో ఏముందిరా'' అంటూ వార్నింగ్ వినిపించగా.. 

దానికి వర్మ.. ''సార్ నా దగ్గర నిజముంది.. నిజానికి సంబంధించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యదార్ధం ఉంది. అది హైదరాబాద్ లోని వైశ్రాయ్ హోటల్ లోని సంఘటనలు అవ్వొచ్చు.. ఇంట్లోనూ, వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు అవ్వొచ్చు. సార్ నిజం నాకన్నా ఎక్కువ మీకు, మీ ఫ్యామిలీకి, మే ఇంటల్లుడుకి తెలుసు సార్. కానీ మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది.

ఎస్.. నా దగ్గర మీ సినిమాలో ఉన్న స్టార్స్ లేరు. కానీ మీ సినిమాలో ఉన్న స్టార్స్ ఎవరికీ మీ సినిమాలో ఉన్న అబద్ధాలు తెలియవు. కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉన్న యాక్టర్స్ అందరికీ నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు. సత్యమేవ జయతే'' అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

I do not know who did not make this on me and Balakrishna Garu, but I also know why I do not know who did not do this .. Read three times to understand and even after that if u don’t understand you are not dumb pic.twitter.com/ibqHBcsgFT

— Ram Gopal Varma (@RGVzoomin)

ఇవి కూడా చదవండి.. 

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

 

click me!