ఈ నెల 3వ తేదీన విశాఖపట్టణంలో హత్యకు గురైన దివ్య కేసును విశాఖపట్టణం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దివ్యను పెళ్లి చేసుకొన్న వీరబాబు కూడ ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్టణం: ఈ నెల 3వ తేదీన విశాఖపట్టణంలో హత్యకు గురైన దివ్య కేసును విశాఖపట్టణం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దివ్యను పెళ్లి చేసుకొన్న వీరబాబు కూడ ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
వీరబాబు వేధింపులకు పిన్ని కాంతవేణి కూడ తోడైంది. దీంతో దివ్య విశాఖపట్టణం వచ్చినట్టుగా పోలీసులు విచారణలో తేలినట్టుగా సమాచారం. విశాఖపట్టణం వచ్చిన దివ్యకు గీత, వసంతలు పరిచయమయ్యారని తేలింది.
undefined
also read:విశాఖ దివ్య కేసు: ఆరుగురు అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు
దివ్యను సుమారు 72 గంటల పాటు చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు నిందితులు. దివ్యను హత్య చేసే సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకొన్నారు. దివ్య కు ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు.
also read:విశాఖ దివ్య కేసులో సంచలన విషయాలు: ఒంటి నిండా వాతలు, అన్నీ విషాదాలే
దివ్య హత్య కేసులో ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులను కూడ అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురి కోసం రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా విశాఖ పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు.
నిందితులను పోలీస్ కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్న విషయాన్ని పోస్టుమార్టం నివేదిక తెలిపింది.దివ్యను అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.