జగన్ చేసే ప్రతిపనికీ చంద్ర‌బాబు మోకాలడ్డు..

By Mahesh RajamoniFirst Published May 4, 2024, 6:44 PM IST
Highlights

Elections 2024 : అభివృద్దిని అడ్డుకోవ‌డ‌మే చంద్ర‌బాబు అస‌లైన నైజం అనీ, అందుకే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పాలిట విల‌న్ లా మారి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ మంచి ప‌ని చేసినా ప్ర‌తిప‌నికి మోకాల‌డ్డుతున్నార‌ని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

YS Jagan vs Chandrababu : ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. అయితే, రాష్ట్రంలో మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైకాపా ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్న నేప‌థ్యంలో టీడీపీ కూట‌మి నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు మ‌రింత‌గా ప‌దును పెంచి విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. దీంతో వైకాపా శ్రేణులు చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌డుతున్నాయి. మంచిని అడ్డుకోవ‌డ‌మే చంద్ర‌బాబు నైజం అంటూ ఆరోపిస్తున్నాయి.

అభివృద్ధి పాలిట విలన్ చంద్రబాబు అనీ, ఏ మంచినీ అంగీకరించని వైనంతో రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టకుండా న‌డుచుకుంటూ సీఎం వైయస్ జగన్ చేసే ప్రతిపనికీ మోకాలడ్డుతున్నార‌ని వైకాపా ఆరోపించింది. బాబు రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌స్తావిస్తూ..  చంద్రబాబు తీరే అంత...ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవని వైకాపా నాయ‌కులు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. బాబు ఏపని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే ఉంటుంద‌న్నారు. అంద‌కే సీఎం వైయస్ జగన్ చేసే ప్రతి పనిని..ప్రతి మంచిని అడ్డుకోవడమే చంద్రబాబు రాజకీయ వ్యాపకంగా  పెట్టుకున్నార‌ని ఆరోపిస్తున్నారు.

విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులకు శ్రీకారం చుట్టిన త‌రుణంలో.. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి వ్యతిరేకించి జనంలో చంద్రబాబు వెర్రిపప్ప అయ్యారంటూ గుర్తు చేస్తున్నారు. వాలంటీర్ల మీద ఇష్టానుసారం కామెంట్లు చేసి తరువాత తీవ్రవ్యతిరేకత రాగానే నాలుక కరచుకుని ..లేదు లేదు.. తాను వాలంటీర్లును కొనసాగిస్తాను..పైగా పదివేలు జీతం ఇస్తాను అన్నారు. ఈవిషయంలో ఆయన ఈసారి కొండెర్రీ పప్ప అయ్యారంటూ వైకాపా నాయ‌కులు పేర్కొంటున్నారు. అమరావతి అంశంలో ఇళ్ల పట్టాల పంపిణీని సైతం అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లిన విష‌యాన్ని గుర్తుచేస్తూ..కేసులు వేశారు. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ఇష్టానుసారం వాగుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని చంద్ర‌బాబు తీరుపై మండిప‌డుతున్నారు.

భూములకు మరింత భద్రత కల్పిస్తూ అక్రమాలు . కబ్జాలు.. రికార్డుల మార్పిడి వంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా ప్రజలను గందరగోళ పరుస్తూ చంద్ర‌బాబు మాట్లాడుతున్నార‌నీ, తనకు చేతకానిది వేరే వాళ్ళు చేస్తే సహించలేని బాబు ఇప్పుడు ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదే త‌ర‌హాగా న‌డుచుకుంటున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ముప్పయ్యేళ్ళుగా చూస్తున్నార‌ని పేర్కొంటున్నారు. అయితే, ప్రజలు మాత్రం నిన్ను నమ్మం బాబుక అంటున్న ప‌ట్టించుకోకుండా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైకాపా నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

జగన్ అంటే విశ్వసనీయతకు ఒక బ్రాండ్ .ఆయన లక్షల ఎకరాల చుక్కల భూములకు రైతులకు హక్కుదారులను చేశార‌ని గుర్తుచేస్తున్నారు. లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు ఇవ్వ‌డంతో పాటు 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చార‌ని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నారు. పేద‌ల కోసం... ప్రజల కోసం ఇన్ని పనులు చేసిన జగన్ పేదల..రైతుల భూములు తీసుకుంటారు అనే చంద్ర‌బాబు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు..మళ్ళీ జగనే వస్తాడు .మా నమ్మకం జగన్ అంటున్నారు వైకాపా శ్రేణులు.

 

click me!