'పాతికేళ్ల క్రితం ఇచ్చిన కోటి ఉద్యోగాల హామీ ఏమైంది?': చంద్రబాబుపై వైసీపీ దాడి..

By Rajesh KarampooriFirst Published May 4, 2024, 1:57 PM IST
Highlights

పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రస్తవత్తరంగా మారుతున్నాయి. అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలువుతున్నాయి. ఈ తరుణంలో పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?  అని వైసీపీ ప్రశ్నిస్తుంది

ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు తారు మారవుతున్నాయి. ఎలాగైనా  ఈసారి అధికారం చేపట్టాలని ప్రతిపక్ష టిడిపి-జనసేన-బిజెపి కూటమి వ్యూహాలు రచిస్తూ ఉంటే.. తాము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక పోలింగ్ తేదీకి మరికొన్ని రోజులే ఉండడంతో ఆయా పార్టీల అగ్రనేతలతో సహా కార్యకర్తలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలువుతున్నాయి. తగ్గేదేలే అన్నట్టు విమర్శ ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో అధికార వైసిపి కూడా ఓ అడుగు ముందుకేసి.. ప్రతిపక్ష టిడిపికి సవాల్ విసిరుతోంది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటర్లను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారంలోకి రావడం కోసం ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారంటూ విమర్శిస్తుంది. 2014లోనే కాదు గతంలో అధికారంలోకి రావడం కోసం  చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధపు ప్రకటనలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని అధికార వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడుకు మాట ఇచ్చి, తప్పడం కొత్తేమి కాదని, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.  పాతికేళ్ల క్రితం (1999లో) చంద్రబాబు.. కోటి ఉద్యోగాలు ఇస్తానని  హామీ ఇచ్చారని, ఇంతకీ ఆ హామీ నెరవేర్చారా?  అని వైసీపీ ప్రశ్నిస్తుంది. చంద్రబాబు తనను తాను ఓ విజనరీగా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడుతున్నారు. అలాగే అదే ఏడాది రేషన్ సరుకులను సైతం ఇంటికి ఇస్తామని మాట ఇచ్చారని.. ఆ హామీని పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు తన  ఎల్లోమీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ..  రాష్ట్రానికి తానే దిక్కని ప్రచారం చేసుకోవడం మినహా.. ఇన్నేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేదంటున్నారు. కానీ  మరోసారి ఆంధ్రకు తానే దిక్కు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారని అధికార వైసిపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటికి వెళ్లి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే.. దానిని ఓర్వలేక ముసలి వాళ్ళను నడి ఎండలో బ్యాంకుల చుట్టూ తినిపిస్తున్నారని వాపోయారు. అలాగే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ పేరిట అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ.. ఓటర్లకు మాయ మాటలు చెప్పి నమ్మించే కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు,   పైఎత్తులకు ఎవరు తలొద్దని అన్నారు. ఏపీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని, ఎన్నికల సమయంలో ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు హితమైన పరిపాలన అందించిన జగన్ ను ఏపీ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

click me!