''వైఎస్ జగన్ కే ఉద్యోగుల సపోర్ట్ … పోస్టల్ బ్యాలట్స్ లో ఫ్యాన్ హవా''

By Arun Kumar PFirst Published May 5, 2024, 11:08 AM IST
Highlights

వరుసగా రెండోసారి వైసిపి అధికారంలోకి వస్తుందని ... వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న ధీమాతో వైసిపి శ్రేణులు ధీమాతో వున్నాయి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్స్ ఓటింగ్ సరళిని చూస్తే తమ నమ్మకం మరింత పెరిగిందని వైసిపి నాయకులు అంటున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి విజయం తమదేనన్న ధీమాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు అందించిన సంక్షేమ పాలన, రాష్ట్రంలో జరిగిన అభివృద్దే తమను గెలిపిస్తాయని వైసిపి నేతలు అంటున్నారు. ఇప్పటికే పోస్టల్ ఓట్ల ద్వారా వైసిపి గెలుపుకు బాటలు పడుతున్నాయని వాళ్లు పేర్కొంటున్నారు. గతంలో తమకు అండగా నిలిచిన వైసిపికి ఇప్పుడు    ఉద్యోగులు అండగా నిలుస్తున్నారని... పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని చూస్తే ఈ విషయం అర్థమవుతోందని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.  

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్  లో నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక మిగిలింది కీలకమైన పోలింగ్ ప్రక్రియ... ఈ నెల 13న ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అయితే అంతకంటే ముందుగానే ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గత శనివారం నుండే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమయ్యింది. 

సహజంగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికారంలో వున్న పార్టీకి అనుకూలంగా వుంటాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ ఓట్లు వన్ సైడ్ పడతాయన్న ధీమాతో వైసిపి వుంది. గత ఐదేళ్లలో ప్రజా సంక్షేమమే కాదు ఉద్యోగుల సంక్షేమానికి కూడా జగన్ సర్కార్ కట్టుబడి వుందని ... అందువల్లే ఉద్యోగులు వైసిపికి అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ... ఆయన సారథ్యంలోనే ప్రజాసేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నట్లు వైసిపి చెబుతోంది. 

గత తెలుగుదేశం ప్రభుత్వంలో తమను పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడని ఉద్యోగులు భావిస్తున్నారట. మాజీ సీఎం చంద్రబాబుకు ఉద్యోగులంటే చాలా చిన్నచూపు ... వాళ్లకు జీతాలెందుకు అంటూ అవహేళన చేసిన సందర్భాలున్నాయని వైసిపి గుర్తుచేస్తోంది. ఇలా తమను పట్టించుకోని చంద్రబాబును ఉద్యోగులు పట్టించుకోవడం లేదని... ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బయటపడిందన్నారు. ఇప్పుడయితే వైసిపి పాలనను చూసారు... గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ తమను ఎలా చూస్తున్నారో వారికి అర్థమయ్యింది. తమకోసం ఏదయినా చేయడానికి సిద్దంగా వుండేది జగన్ మాత్రమేనని ఉద్యోగులు నమ్ముతున్నారు... అందువల్లే వైసిపి గెలిపించేందుకు సిద్దమయ్యారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

 వైఎస్ జగన్ గత ఐదేళ్లలో ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరించడంతో పాటు వారి జీతాలను కూడా భారీగా పెంచారని వైసిపి నాయకులు చెబుతున్నారు.  ఉద్యోగుల కోసం వైసిపి సర్కార్  గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(జిపిఎస్) అమలుచేస్తోంది... ఇది తమకెంతో లాభసాటిగా వుందని ఉద్యోగులు అంటున్నారట. ఇలా ఉద్యోగుల పక్షాన నిలిచిన వైస్ జగన్ ఉద్యోగులు కూడా మద్దతిస్తున్నారని ... పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని వైసిపి నాయకులు అంటున్నారు. 

చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే... ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం చేస్తాడని ఉద్యోగులు భయపడుతున్నారట. అంతేకాదు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదు... రాష్ట్ర బడ్జెట్ మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుంది... కాబట్టి తమకు జీతాలు పెంచడం మాట అటుంచి ఉన్న జీతాలను సమయానికి అందించలేడని ఉద్యోగులు భావిస్తున్నారట.  అందువల్లే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు అందించడమే కాదు ప్రతి నెలా సమయానికి తమ జీతాలు అందిస్తున్న జగన్ కే ఉద్యోగులు జై కొడుతున్నారు. అందువల్లే పోస్టల్ బ్యాలట్ ఓట్లన్ని ఫ్యాన్ గుర్తుకే పడుతున్నాయని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఉద్యోగులే కాదు ప్రజలు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరోసారి జగన్ ను సీఎం చేసేందుకు సిద్దమయ్యారని వైసిపి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 


 

click me!