Asianet News TeluguAsianet News Telugu

విశాఖ దివ్య కేసు: ఆరుగురు అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ దివ్య కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నిందితులను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం వారిని నేరుగా మేజిస్ట్రేట్ ఎదురు హాజరుపర్చనున్నారు. 

6 accused arrested in vizag divya murder case
Author
Visakhapatnam, First Published Jun 7, 2020, 7:14 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ దివ్య కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. నిందితులను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. పరీక్షల అనంతరం వారిని నేరుగా మేజిస్ట్రేట్ ఎదురు హాజరుపర్చనున్నారు. 

ఈ నెల 3వ తేదీన విశాఖపట్టణం జిల్లా అక్కయ్యపాలెం వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించిన దివ్య కేసులో  విస్తుపోయే విషయాలను పోలీసులు గుర్తించారు. దివ్యను అత్యంత క్రూరంగా హింసించి హత్య చేసినట్టుగా పోలీసులు  అభిప్రాయపడుతున్నారు. పోస్టుమార్టం నివేదికలో కూడ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

తాను వేరే చోటుకు వెళ్లిపోతానని చెప్పడమే దివ్య మరణానికి కారణంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతి తీవ్రంగా ఆమెను హింసకు గురి చేసినట్టుగా పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దివ్య ప్రైవేట్ పార్ట్స్‌ల్లో కూడ వాతలు పెట్టినట్టుగా ఓ తెలుగు న్యూస్ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది.

72 గంటల పాటు కనీసం మంచినీళ్లు, భోజనం కూడ లేకుండా దివ్యను తీవ్రంగా హింసించారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా హింసించారని తెలిసింది. తన సోదరి మంజుతో పాటు వరసకు మామయ్య అనే వ్యక్తితో కలిసి దివ్యకు ఆశ్రయం ఇచ్చిన వసంత గుండు గీయించింది. ఆమె కనురెప్పలు కత్తిరించారు. 

అట్లకాడతో ఆమెకు వాతలు పెట్టారు. తిండి కూడ పెట్టలేదు. అట్లకాడతో  వాతలు పెట్టినవే ఎక్కువగా ఉన్నట్టుగా వైద్యుల నివేదికను బట్టి తెలుస్తోంది. చపాతీ కర్రతో కొట్టడం వల్లే బలమైన గాయాలైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వసంత, మంజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దివ్య పిన్నిని రావులపాలెం నుండి శనివారం నాడు పోలీసులు విశాఖపట్టణం తీసుకొచ్చారు. 

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దివ్య తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అమ్మమ్మ కూడ 2015లో హత్యకు గురయ్యారు. దీంతో పిన్ని క్రాంతివేణి వద్ద దివ్య ఉండేది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని దివ్య ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతడితో విడిపోయి ఏడాది క్రితం విశాఖకు వచ్చిందని సమాచారం.

విశాఖలోని గుట్టల వసంత అలియాస్ జ్యోతితో దివ్యకు పరిచయమైంది. దివ్యతో వసంత వ్యభిచారం చేయించారని ప్రచారం సాగుతోంది. దివ్యకు వచ్చే డబ్బుల పంపకంలో తేడాలు రావడంతో తాను బయటకు వెళ్లిపోతానని వసంతకు చెప్పింది. దీంతో వసంత ఆమెను బంధించి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

దివ్య కుటుంబంలో అన్నీ విషాదాలే:
దివ్య కుటుంబంలో అన్నీ విషాదాలే చోటు చేసుకొన్నాయి. దివ్య అమ్మమ్మ నాగమణికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు నల్లా సుబ్బలక్ష్మి.ఆమె భర్త ఆటో డ్రైవర్. వీరికి దివ్య, గణేష్ ఇద్దరు సంతానం. దివ్య పిన్ని క్రాంతివేణి యానాంకు చెందిన చప్పిడి వీరవెంకట సత్యనారాయణను ప్రేమించి పెళ్లి చేసుకొంది. సత్యనారాయణ అంతరాష్ట్ర గజదొంగ. ఓ కేసులో శిక్ష పడడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. 

అదే జైలులో శిక్షను అనుభవించిన రాజమండ్రికి చెందిన నల్ల మహారాజు అనే రౌడీషీటర్ తో సత్యనారాయణకు పరిచయం ఏర్పడింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి దొంగతనాలు చేసేవారు.

వాటాల పంపకంలో తేడాలు రావడంతో నాగమణి, దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్ లను నల్ల మహారాజు కిడ్నాప్ చేశాడు. 2014 అక్టోబర్ 16న వీరంతా హత్యకు గురయ్యారని పోలీసులు గుర్తించారు. 

దివ్య తల్లి చనిపోవడంతో తండ్రి మరో పెళ్లి చేసుకొన్నాడు. దీంతో పిన్ని క్రాంతివేణి సంరక్షణలో పెరిగింది. క్రాంతివేణిని కూడ భర్త వదిలివెళ్లిపోయాడు. ఇదే సమయంలో దివ్య ఏలేశ్వరానికి చెందిన వ్యక్తిని దివ్య విహహం చేసుకొంది. ఆ తర్వాత అతడితో విడిపోయినట్టుగా సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios